తాజాగా విదులైన ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన నెం. 1 ర్యాంక్ ను తిరిగి దక్కించుకున్నాడు. అయితే భారత్ టెస్ట్ ఆటగాడు చేటేశ్వర్ పుజారా, తన కెరీర్ లోనే అత్యుత్తమైన రెండో స్థానానికి ఎగబాకాడు.

అగ్రస్థానం లో ఉన్న స్టీవ్ స్మిత్ యాషెస్ సిరీస్ లో జరిగిన మొదటి టెస్ట్ లో అద్భుతమైన టెస్ట్ సెంచరీ సాధించాడు. దీనితో అతని రేటింగ్ పాయింట్స్ 941 కి చేరాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో స్టీవ్ స్మిత్ ఇప్పుడు హైయెస్ట్ రేటింగ్ పాయింట్స్ సాధించిన బాట్స్మెన్ లో ఐదో స్థానం అందుకున్నాడు.

సర్ డాన్ బ్రాడ్మన్ (961), లైన్ హాటోన్ (945), జాక్ హాబ్స్ (942), రికీ పాంటింగ్ (942) మాత్రమే స్టీవ్ స్మిత్ కంటే ఎక్కువ రేటింగ్ పాయింట్స్ సాధించారు. కానీ ఆయన తర్వాత రెండు నుంచి ఐదు స్థానాల మధ్య కేవలం 11 రేటింగ్ పాయింట్స్ వ్యతాసం మాత్రమే ఉంది.

పుజారా 22 రేటింగ్ పాయింట్స్ సాధించి తన కెరీర్ లోనే హైయెస్ట్ 888 పాయింట్లుతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీ కూడా తన డబుల్ సెంచరీ తరవాత 60 పాయింట్లు సాధించి 877 పాయింట్లతో ఐదో స్థానం లో కొనసాగుతున్నాడు.

ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ మూడో స్థానం లో ఉండగా, న్యూజిలాండ్ కెప్టెన్ కెయిన్ విలియమ్ సన్ నాలుగో స్థానం లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ తర్వాత 51 పాయింట్ల దూరం లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ ఆరో స్థానం దక్కించుకున్నాడు.

భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా తన రెండో స్థానం ని మరల దకించుకోగా, రవించంద్రన్ అశ్విన్ నాలుగో స్థానం లో కొనసాగుతున్నాడు. టెస్ట్ క్రికెట్ లో తిరిగి మరల ఆడుతున్న మిట్చెల్ స్టార్క్ 10 వ స్థానం కి ఎగబాకాడు.

SHARE