ఒత్తిడిలో భారత స్పిన్నర్లు

బ్రిస్టల్ :టీమిండియా తన 70 రోజుల ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా మూడు టీ-20 మ్యాచ్‌లు ఆడుతున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థిపై ఘన విజయాన్ని నమోదు చేసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సేన శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం ఓటమిని మూటకట్టుకుంది. ఈ మ్యాచ్‌తోపాటు మూడో టీ-20లో గెలిచి సిరీస్ సొంతం చేసుకుంటామని కలలుగన్న కోహ్లీ ఆశలపై ప్రత్యర్థి టీమ్ నీళ్లు చల్లింది. ఆదివారం జరిగే మూడో మ్యాచ్ భారత స్పిన్నర్ల ద్వయానికి ఏడాది తర్వాత ఒకవిధంగా సవాల్ లాంటిదే. కార్డ్ఫిలో తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించిన భారత ఎడమచేతి మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ సహా యుజువేంద్ర చాహల్ రెండో మ్యాచ్‌లో మాత్రం వికెట్లు తీయడానికి ఆపసోపాలు పడాల్సి వచ్చింది. టీమిండియాలో గాయపడిన మరో స్పిన్నర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఆడుతున్న ఉమేశ్‌ రెండు మ్యాచ్‌ల్లో కలిపి 4 వికెట్లు తీశాడు. కానీ పరుగులు ధారాళంగా ఇచ్చుకున్నాడు.

రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ టచ్‌లోకి రావడంతో భారత్‌కు కష్టాలు తప్పలేదు. ఈ నేపథ్యంలో బౌలర్లు వైవిధ్యంపై దృష్టిసారిస్తేనే ఫలితాలు రాబట్టుకోవచ్చు. బ్యాటింగ్‌ విషయానికొస్తే కుల్దీప్‌లాగే రాహుల్‌ పరిస్థితి ఉంది. మాంచెస్టర్‌లో ‘శత’క్కొట్టేసిన ఈ టాపార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కార్డిఫ్‌లో విఫలమయ్యాడు. ఓపెనర్లూ చేతులెత్తేయడంతో మిడిలార్డర్‌పై భారం పెరిగింది. అయితే సిరీస్‌ను తేల్చే ఈ మ్యాచ్‌లో రోహిత్, ధావన్‌లు తమ ప్రభావం చూపిస్తే పరుగుల ప్రవాహానికి అడ్డు ఉండదు.

SHARE