సౌత్ ఆఫ్రికా తో కేప్ టౌన్ లో జరిగే ఆఖరి టీ 20 మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా ఆడటం కష్టమే అని వార్తలు వస్తున్నాయి. ఉదార సంబంధిత బెణుకు కారణంగా రెండో టీ 20 లో ఆడలేకపోయిన బుమ్రా, ఇప్పుడు ముఖ్యమైన మూడో టీ 20 కి కూడా అనుమానంగానే ఉన్నాడు.

రెండో టీ 20 లో భారత్ క్రికెట్ జట్టు, బుమ్రా యొక్క డెత్ బౌలింగ్ ను చాలా మిస్ అయింది. తొలుత బాగా రాణించిన భారత్ బౌలర్లు తరువాత డుమినీ, క్లాస్సేన్ ను అడ్డుకట్ట వేయలేకపోయారు. చివర్లో సౌత్ ఆఫ్రికా చాలా సులువుగా విజయం సాధించడంతో సిరీస్ 1-1 తో సమం గా ఉంది.

సిరీస్ ను తేల్చే ఆఖరి మ్యాచ్ లో భారత్ కు బుమ్రా అవసరం చాలా ఉన్న సరే, టీం యాజమాన్యం రిస్క్ తీసుకునే ఆలోచనలో లేరు అనే విషయం తెలుస్తుంది.

బుమ్రా సౌత్ ఆఫ్రికా సిరీస్ లో మొత్తం మూడు టెస్టులు, ఆరు వన్డేల్లో, మొదటి టీ 20 మ్యాచ్ ఆడాడు. ఐతే కేవలం ఆఖరి మ్యాచ్ ఆడలేకపోయిన ఈ పేస్ బౌలర్, ఆఖరి మ్యాచ్ లో కూడా ఆడటం కష్టంగానే కనిపిస్తుంది.

తద్వారా ఈ సౌత్ ఆఫ్రికా పర్యటన లో అన్ని మ్యాచులు ఆడిన ఏకైక ప్లేయర్ గా మిగిలాడు భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. కోహ్లీ ఇప్పటి వరకు జరిగిన అన్ని టెస్టులు, వన్డేలు, టీ 20 ల్లో ఆడాడు. అతను ఆఖరి టీ 20 కి విశ్రాంతి తీసుకునే అవకాశాలు చాలా తక్కువ అనే చెప్పాలి.

శ్రీలంక లో త్వరలో జరగబోయే టీ 20 సిరీస్ కు భారత్ సెలెక్టర్లు సీనియర్ అత్తగాళ్లకు విశ్రాంతి కలిపించే ఆలోచనలో ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా గత ఏడాది ఆగష్టు నుంచి జరుగుతున్న అన్ని వన్డేలు, టీ 20 సిరీస్ లలో పాల్గొన్నాడు.

ఆఖరి సారి అతనికి గత ఏడాది వెస్ట్ ఇండీస్ వన్డే సిరీస్ కు విశ్రాంతి కల్పించిన సెలెక్టర్లు, శ్రీలంక లో బాంగ్లాదేశ్, శ్రీలంక తో జరిగే ట్రై సిరీస్ కు యువ క్రికెటర్లతో కూడిన జట్టును పంపే యోచన చేస్తున్నారు.

SHARE