ఐపిఎల్ రేటెన్షన్ తుది లిస్ట్ బయటకు వచ్చినపుడు రాయల్ ఛాలేంజర్స్ బెంగుళూరు యుజ్వేంద్ర చాహల్ ను తిరిగి రెటైన్ చేసుకోకపోవడం చాలా మందినే ఆశ్చర్యపరిచింది.

రాయల్ ఛాలేంజర్స్ విరాట్ కోహ్లీ, ఏ బీ డివిల్లీర్స్ మరియు సర్ఫరాజ్ ఖాన్ ను రెటైన్ చేసుకోగా, మరో రెండు రైట్ టు మ్యాచ్ కార్డ్స్ ను వచ్చే ఆక్షన్ లో వాడుకోవచ్చు. గత సీజన్లో రాయల్ ఛాలేంజర్స్ కు ఎక్కువ వికెట్లు తీసిన చాహల్, రాబోయే వేలంపాట తనను మళ్ళీ తన జట్టు తిరిగి పాడుకుంటారు అని అభిప్రాయం వ్యక్తం చేసాడు.

రాయల్ ఛాలేంజర్స్ జట్టులో చాలా మంది ముఖ్యమైన ఆటగాళ్లు వచ్చే ఆక్షన్ లో అందుబాటులో ఉండబోతున్నారు. క్రిస్ గేల్, మిచెల్ స్టార్క్, యుజ్వేంద్ర చాహల్, కే ఎల్ రాహుల్ లాంటి పెద్ద ఆటగాళ్ళని కోల్పోయిన బెంగుళూరు ఫ్రాంచైజ్, వీలైనంత మంది ఆటగాళ్లను తిరిగి దక్కించుకునేందుకు చూస్తున్నారు.

అయితే భారత్ జట్టులో ప్రత్యేక ప్రదర్శనలతో తన స్థానం పదిలం చేసుకున్న చాహల్, వచ్చే ఆక్షన్ లో ఆర్ సి బి తనను తిరిగి దక్కించుకుంటారు అని ఆశ భావం వ్యక్తం చేసాడు.

అయితే ఈ నెల 27 న జరిగే ఐపిఎల్ ఆక్షన్ లో చాహల్ కేవలం ఆర్ సి బి కాకుండా అన్ని ఫ్రాంచైజీలు చాహల్ ను దక్కించుకుందుకు ప్రయత్నిస్తాయి. రాబోయే ఆక్షన్ లో కేవలం 49 కోట్ల తో వెళ్లనుంది బెంగుళూరు ఫ్రాంచైజ్.

SHARE