ఇటీవలే అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న యో యో టెస్టు మరో సారి హెడ్ లైన్స్ లోకి వచ్చింది. ఐతే ఈ సారి ప్రస్తుత భారత్ జట్టులో ఉన్న అందరు ఆటగాళ్లు ఈ నెల మరో సారి ఫిట్నెస్ టెస్టులో పాల్గొననున్నారు అని బీసీసీఐ ప్రకటించింది.

గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ అయినా తరువాత చాలా వివాదాలకు దారి తీసిన యో యో టెస్ట్ ను బీసీసీఐ కచ్చితం చేసింది. భారత జట్టుకు ఆడాలనుకొనే ప్రతి క్రికెటర్ ఈ ఫిట్నెస్ టెస్టులో కచ్చితంగా పాస్ అవ్వాలి అనే రూల్ ను ప్రవేశపెట్టింది బోర్డు. ఐతే ఆఫ్గనిస్తాన్ పై ఈ ఏడాది ఆడనున్న చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ ముందు ఈ టెస్టులు జరగున్నాయి.

ఈ నెల 14 నుండి ఆఫ్గనిస్తాన్ తో భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. ఐతే ఆఫ్ఘానిస్తాన్ చరిత్రలోనే ఇది వారి తొలి టెస్టు మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ పై చాలా మంది క్రికెట్ అభిమానుల ద్రుష్టి పడింది. ఈ మ్యాచ్ లో పాల్గొనడంతో అంతర్జాతీయ క్రికెట్ లో 12 వ టెస్ట్ జట్టుగా రెకార్డుకెక్కనుంది.

ఐతే ఈ మ్యాచ్ కంటే ముందు టీం యాజమాన్యం మరియు కోచింగ్ స్టాఫ్ కలిసి యో యో టెస్టుకు చేయాల్సిన విధానం పై ఒక రిపోర్ట్ తయారుచేస్తారు. ఈ రిపోర్ట్ ను బీసీసీఐ కు సమర్పించిన తరువాత, ఆటగాళ్లంతా ఈ నెల 8 న బెంగళూరు లోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఈ టెస్టులో పాల్గొని వారి ఫిట్నెస్ నిరూపించుకోనున్నారు.

ఈ టెస్టులో అందరు అంతర్జాతీయ క్రికెటర్లు పాల్గొనడాన్ని ఖరారు చేసింది బీసీసీఐ. ఐతే కేవలం భారత్ సీనియర్ క్రికెట్ జట్టు సభ్యులే కాకుండా భారత్ ‘ఏ’ జట్టు క్రికెటర్లు కూడా ఈ టెస్టుల్లో పాల్గొనాలి అని బోర్డు తెలిపింది.

ఐతే భారత్ ‘ఏ’ టీం ఆటగాళ్లు మాత్రం జూన్ 3 , 4 తేదీల్లో ఫిట్నెస్ టెస్టుల్లో పాల్గొనున్నారు. భారత్ ‘ఏ’ జట్టు ఈ నెలలో ఇంగ్లాండ్, వెస్ట్ ఇండీస్ తో కలిసి ముక్కోణపు సిరీస్ లో కచ్చితంగా పాల్గొంటారు.

గత ఏడాది యువరాజ్ సింగ్, సురేష్ రైనా వారి ఫిట్నెస్ ను యో యో టెస్ట్ ద్వారా నిరూపించుకోలేక భారత్ జట్టునుండి వెలువడ్డారు. దీనితో బాగా ప్రఖ్యాతి కాంచిన యో యో టెస్టుకు ఈ ఏడాది కూడా ఎంతో ఆసక్తి ఏర్పడింది. ఈ ఏడాది అందరు ఆటగాళ్లు బీసీసీఐ పెట్టిన స్కోర్ ను సాధించి పాస్ అవుతారు అని కోరుకుందాం.

SHARE