భారత్ లో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు సన్నద్ధం అవుతున్న శ్రీ లంక, 15 మంది తో కూడిన తుది జట్టు ప్రకటించింది.

అయితే ఈ సరి లంక సెలక్షన్ కమిటీ సరిగా ఆడని ఆటగాళ్ళని వేటు వేయడం గమనార్హం. భారత్ పై 9 -0 తో తమ సొంత గడ్డ పై ఓడిపోయిన శ్రీ లంక, పాకిస్తాన్ పై పుంజుకుని అబూ దాబి లో టెస్ట్ సిరీస్ గెలిచారు.

కానీ ఇంత వరకు ఎప్పుడు భారత్ లో ఎప్పుడు టెస్ట్ మ్యాచ్ కూడా గెలవని లంక, కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్తాన్ పై కేవలం 2 టెస్టుల్లో 57 పరుగులు చేసిన కుశాల్ మెండిస్ పై వేటు వేశారు.

ఫామ్ లేక సరిగా ఆడలేకపోతున్న కౌశల్ సిల్వా మరియు నువాన్ ప్రదీప్ ను కూడా తుది జట్టు నుంచి తీసేసారు. సిల్వా కేవలం పాకిస్తాన్ పై 67 పరుగులు చేయగా, ప్రదీప్ కేవలం 3 వికెట్లే తీసాడు.

అయితే గాయం నుండి కోలుకున్న ఏంజెలో మాథ్యూస్ తిరిగి రావడం శ్రీలంక కు చాలా పెద్ద ప్లస్ అవ్వగా, యువ క్రికెటర్లు దాసున్ షానాక మరియు ధనంజయ డి సిల్వా మళ్ళీ టెస్ట్ జట్టు కు ఎంపిక అయ్యారు.

షానాక ఇప్పటి వరకు శ్రీలంక కు ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. ధనంజయ 10 టెస్టులు ఇప్పటికి వరకు ఆడగా, అతని ఆఖరి టెస్ట్ భారత్ పై ఆగష్టు లో ఆడాడు. అయితే అతని వెస్ట్ ఇండీస్ A జట్టు పై అత్యుత్తమ ప్రదర్శనల వల్ల మళ్ళీ టీం లో కి ఎంపిక అయ్యాడు.

భారత్ తో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ నవంబర్ 16న ఈడెన్ గార్డెన్స్ లో మొదలవుతుంది. ఆ తర్వాత ఢిల్లీ లో ఫిరోజ్ షా కోట్ల, నాగపూర్ లో VCA స్టేడియం లో ఆఖరి రెండు మ్యాచ్లలో ఇరు జట్లు తలబడతాయి.

శ్రీ లంక జట్టు : దినేష్ చండీమల్ (కెప్టెన్), దిముత్ కరుణరత్నే, ధనంజయ డి సిల్వా, సుధీర సమరవీసీక్రేమా, ఏంజెలో మాథ్యూస్, లాహిరు తిరిమన్నే, రంగనా హెరాత్, సురంగ లక్మల్, దిలారువాన్ పెరీరా, లాహిరు గామాగే, లక్షన్ సందకన్, విశ్వా ఫెర్నాండో, దాసున్ షానాక, నిరోషన్ డిక్వెల్ల (wk), రోషెన్ సిల్వా

SHARE