కార్డిఫ్‌:ఇంగ్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన భారత్‌ మరో సమరానికి సిద్ధమైంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై విజయం సాధించిన టీమిండియా ఒక మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది.తొలి మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన కోహ్లి సేన రెండో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలనుకుంటోంది. కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ ఈ మ్యాచ్‌కి ఆతిథ్యమివ్వనుంది.

రెండో టీ20లో టీమిండియా విజయం సాధిస్తే
దీంతో రెండో టీ20లో కూడా విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరిస్‌ను కైవసం చేసుకోవాలనే ఆలోచనలో టీమిండియా ఉంది. గతేడాది నవంబర్‌లో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా… ఆ తర్వాత జరిగిన అన్ని టీ20 సిరిస్‌ల్లోనూ విజయం సాధించింది.
రెండో టీ20లో నెగ్గితే వరుసగా ఆరో టీ20 సిరీస్‌
న్యూజిలాండ్ తర్వాత శ్రీలంక, దక్షిణాఫ్రికాలపై టీ20 సిరిస్‌లను కైవసం చేసుకున్న టీమిండియా… శ్రీలంకలో జరిగిన నిదాహాస్‌ ముక్కోణపు టీ20 సిరీస్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఐర్లాండ్‌తో ముగిసిన రెండు టీ20ల సిరిస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరగనున్న రెండో టీ20లో నెగ్గితే భారత్ వరుసగా ఆరో టీ20 సిరీస్‌ను సాధించినట్లవుతుంది.అలాగే 3-0తో నెగ్గితే ఆసీ్‌సను వెనక్కినెట్టి భారత్‌ రెండో ర్యాంక్‌ సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడినా జట్టుకు వచ్చిన ఇబ్బందేమీ లేదు కానీ ఇంగ్లండ్‌ మాత్రం కచ్చితంగా నెగ్గాల్సిందే. అలాగైతేనే వారు సిరీస్‌పై ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుంది. అటు ర్యాంకింగ్‌ పరంగానూ ఈ జట్టు ఏడో స్థానానికి పడిపోతుంది.

జట్ల వివరాలు
టీమిండియా:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మనీష్ పాండే, ధోని(వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్, హార్ధిక్ పాండ్యా, సిద్దార్ధ్ కౌల్, ఉమేశ్ యాదవ్

ఇంగ్లాండ్:
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్ స్టో, జేక్ బాల్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), శామ్ కుర్రన్, అలెక్స్ హేల్స్, క్రిస్ జోర్డాన్, లైమ్ ప్లెంకెట్, అదిల్ రషీద్, జో రూట్, జాసన్ రాయ్, డేవిడ్ విల్లీ, దావిద్ మలన్

SHARE