మాంచెస్టర్‌: ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనలో వన్ డే ,T 20 లలో విజయం అందుకు వచ్చాక..భారత్ చిన్న స్థాయి సిరీస్‌లు, ఐపీఎల్‌తో బిజీ గా మారారు. సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో ఓ పెద్ద సవాలు ఎదుర్కోబోతున్నారు. ఇంగ్లాండ్‌ పర్యటనలో భాగంగా ముందుగా పొట్టి సిరీస్‌లో ఐర్లాండ్‌ను చిత్తుచేసిన కోహ్లీసేనకు ఈ రెండు టీ20ల సిరీస్ సన్నాహక మ్యాచ్ అనే చెప్పాలి . ఇందులో మెన్ ఇన్ బ్లూ వీరబాదుడుతో బ్యాట్స్‌మెన్‌కు.. వికెట్లను పడగొట్టడంలో అటు బౌలర్లకు కావాల్సినంత ప్రాక్టీస్‌ లభించింది. ఇప్పుడు కఠిన సవాల్‌కు సిద్ధమవుతోంది.ఈ మధ్య కాలం లో పొట్టి ఫార్మాట్‌లో భారత్‌ నిలకడైన ప్రదర్శన సాగిస్తోంది. భారత్ ఆడిన 20మ్యాచ్‌ల్లో ఈ జట్టుకు 15 విజయాలున్నాయి.

రాహుల్‌కు చోటు దక్కేనా!
జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ అంతా ఫామ్‌లో ఉన్నా ‘కష్టమే..’ ఇప్పుడు భారత్‌ లైనప్‌ విషయంలో కెప్టెన్‌ కోహ్లీని ఇదే సమస్య వేధిస్తోంది. ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ ఐర్లాండ్‌ మ్యాచ్‌తో ఫామ్‌లోకొచ్చాడు. అలాగే రెండో మ్యాచ్‌లో రాహుల్‌, రైనా అర్ధ సెంచరీలతో చెలరేగారు. ఇక ధవన్‌, పాండ్యా, మనీష్‌ పాండే కూడా రాణించినా నిజానికి విఫలమైంది కెప్టెన్‌ కోహ్లీనే. ఇతను రెండు మ్యాచ్‌ల్లో ఓ డకౌట్‌తో 9 రన్స్‌ చేశాడు. అయితే ఇప్పుడు తుది జట్టులో ఎవరుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్లుగా రోహిత్‌, ధవన్‌ ఓకే. ఆ తర్వాత కోహ్లీ, రైనా, ధోనీ ఉండగా మరో బెర్త్‌ కోసం రాహుల్‌, దినేశ్‌ కార్తీక్‌, పాండే ఎదురుచూస్తున్నారు. ఐర్లాండ్‌పై 36 బంతుల్లో 70 రన్స్‌ చేసిన రాహుల్‌ ఈ రేసులో ముందుండే అవకాశముంది. పాండ్యా ఆల్‌రౌండర్‌ కేటగిరీలో ఉండగా స్పి న్నర్లుగా చాహల్‌, కుల్దీప్‌.. బుమ్రా గాయంతో భువనేశ్వర్‌కు జతగా మరో పేసర్‌ ఉమేశ్‌ జట్టులో ఉండే అవకాశం ఉంది.

 

SHARE