శ్రీలంక తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో మూడో టెస్ట్ కు మరియు రాబోయే మూడు వన్ డేలకు తుది జట్టు ను ఈ రోజు సెలక్షన్ కమిటీ విడుదల చేసింది.

భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కు వన్ డే సిరీస్ లో విశ్రాంతి కల్పించగా, ఆయన మూడో టెస్ట్ లో మాత్రం ఆడతారు. రోహిత్ శర్మ శ్రీలంక పై జరిగే మూడు వన్ డే లలో భారత్ జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.

శ్రీలంక పై వన్ డే సిరీస్ డిసెంబర్ 10 నుండి ప్రారంభం కానుంది. ఇటీవలే విరాట్ కోహ్లీ భారత్ విపరీతగంగా క్రికెట్ ఆడటం పై తన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం అందరికి తెలిసిందే.

2015 నుంచి జరిగిన మ్యాచ్లలో విరాట్ కోహ్లీ ఒకడే 100 మ్యాచ్లకు పైగా ఆడటం గమనార్హం. ఆయన 115 అంతర్జాతీయ మ్యాచులు ఆడగా, తదుపరి స్థానం లో మాజీ కెప్టెన్ ధోని 92 మ్యాచులు ఆడాడు.

టెస్ట్ సిరీస్ కు విశ్రాంతి కల్పించిన హార్దిక్ పాండ్య ను సెలక్షన్ కమిటీ మరల వన్ డే జట్టు లో ఎంపిక చేయగా, తొలి సారి సిద్దార్థ్ కౌల్ ను కూడా వచ్చే సిరీస్ కు ఎంపిక చేసారు. పంజాబ్ పేసర్ కౌల్, ఐపిఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లో కీలక పాత్ర పోషించాడు.

మరో సారి రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కు సెలెక్టర్లు మొండి చేయి చూపించగా, స్పిన్ త్రయం యుజ్వేంద్ర చాహల్, అక్సర్ పటేల్ మరియు కుల్దీప్ యాదవ్ ను ఎంపిక చేశారు.

ఫామ్ లేక సతమతమవుతున్న కర్ణాటక ఆటగాడు కే ఎల్ రాహుల్ ను జట్టు నుండి తప్పించగా, ముంబై బాట్స్మన్ శ్రేయాస్ ఇయర్ ను ఆవకాశం కల్పించారు. సీనియర్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, సురేష్ రైనా ను మళ్ళీ సెలెక్టర్లు టీం లో తీసుకోలేదు. దీనితో వీరు మళ్ళీ భారత్ జట్టు కు ప్రాతినిధ్యం వహించడం కష్టమనే చెప్పాలి.

అలానే మూడో టెస్ట్ కు శిఖర్ ధావన్ తిరిగి జట్టు లో చేరనున్నారు. రెండో టెస్ట్ ను గాయంతో మిస్ అయినా మహమ్మద్ షమీ, కొత్తగా టీం లోకి వచ్చిన విజయ్ శంకర్ ఇద్దరు మూడో టెస్ట్ తుది జట్టు లో స్థానము పొందారు.

మూడో టెస్ట్ కు భారత్ జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఎం విజయ్, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, వృద్ధిమన్ సాహా, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షామి, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, విజయ్ శంకర్

వన్ డే సిరీస్ కు భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, కేదార్ జాధవ్, దినేష్ కార్తీక్, ఎంఎస్ ధోనీ, హరిక్ పాండ్య, ఆక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, జాస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్.

SHARE