ఈ వారం భారత్ తో శ్రీలంక టెస్టు సిరీస్ ఆడనుంది. ఐతే శ్రీ లంక ఇటీవలే సరిగా రాణించకపోవడంతో ఈ సిరీస్ పై జనంలో పెద్ద ఆసక్తి లేదు. కానీ ఒకప్పుడు ఈ ఇరు జట్లు చాలా హోరాహోరీ గా తలపడేవి.

శ్రీ లంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తాను ఆడే సమయం లో భారత్ బాటింగ్ కు మించిన గొప్ప బాటింగ్ లైన్ అప్ ఎవరికీ లేదు అని చెప్పారు. అప్పట్లో భారత్ టెస్ట్ జట్టు లో వీరేంద్ర సెహ్వాగ్ మొదలుకొని రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ మరియు లక్ష్మణ్ తో పటిష్టమైన బాట్స్మెన్ జట్టు లో ఉండేవారు.

టెస్ట్ క్రికెట్ లో 800 వికెట్లు తీసిన మురళీధరన్, క్రిక్ బజ్ తో మాట్లాడుతూ, “నేను భారత్ జట్టు ఎదురు గా ఆడేటప్పుడు, వాళ్లకు ప్రపంచం లోనే అత్యుత్తమ బాటింగ్ లైన్ అప్ ఉండేది. ఇప్పటి బాటింగ్ కన్నా వాళ్ళ బాటింగ్ అప్పుడు ఇంకా గట్టిగా ఉండేది.

“ఆ బాటింగ్ లైన్ అప్ లో అప్పట్లో గంభీర్, సెహ్వాగ్, ద్రావిడ్, టెండూల్కర్, గంగూలీ, లక్ష్మణ్ మరియు ధోని ఇలా నెం. 1 నుంచి 7 వరకు అందరు చాలా మంచి ఆటగాళ్లు. అందులో కొంత మంది క్రికెట్ చరిత్రలోనే దిగ్గజాలుగా నిలిచారు. వాళ్ళని అవుట్ చేయడం మాకు చాలా కష్టం అయ్యేది. ”

భారత్ జట్టు ఎంత పటిష్టంగా ఉన్న సరే శ్రీలంక ను శ్రీలంకలో ఓడించడానికి 22 సంవత్సరాలు పట్టింది. అయితే మురళీధరన్ తాము భారత్ లనే సొంత గడ్డ పై చాలా పటిష్టమైన జట్టు అని చెప్పారు. అందుకే భారత్ కు అంత సమయం పట్టింది అని అభిప్రాయం వ్యక్తం చేసారు.

Hyderabad : Indian skipper Virat Kohli with teammates walk off the field after defeating Bangladesh in the cricket test match in Hyderabad on Monday. PTI Photo (PTI2_13_2017_000158A)

ఇప్పటి వరకు భారత్ పై భారత్ లో టెస్ట్ మ్యాచ్ గెలవని శ్రీలంక ఈ సరి కూడా గెలవడం కష్టమే అని ఈ స్పిన్ మాంత్రికుడు అభిప్రాయ పడ్డారు. ఇటీవలే శ్రీలంక ను శ్రీలంక లో ఓడించిన భారత్ మరో సారి అటువంటి ప్రదర్శన చేయడం సాధ్యమే.

“భారత్ ను సొంత గడ్డ పై ఓడించడం అసలు తేలిక కాదు. ఈ సారి కూడా టెస్ట్ మ్యాచ్ గెలిచే అవకాశం చాలా తక్కువ. భారత్ కు వచ్చిన అన్ని జట్లు చాలా ఇబ్బంది పడ్డాయి. గత 13 ఏళ్లలో కేవలం రెండు జట్లు మాత్రమే భారత్ పై టెస్ట్ సిరీస్ గెలిచాయి.”

SHARE