లీడ్స్‌: ట్రై సిరీస్‌లో చెరో మ్యాచ్ సొంతం చేసుకోవడంతో, చివరి మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. మంగళవారం మ్యాచ్‌పై కోహ్లీ సేన ప్రత్యేక దృష్టిపెట్టింది.నాటింగ్‌హామ్‌లో జరిగిన తొలి వనే్డలో ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది ప్రత్యర్థిని సవాల్ చేసింది టీమిండియా. గురువారం లార్డ్స్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో 86 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది ఇంగ్లాండ్. దీంతో రెండు జట్ల స్కోరు 1-1తో సమమైంది. ఇప్పుడు మూడో వనే్డ ఇరు జట్లకూ అత్యంత కీలకం. సిరీస్‌పైనే దృష్టిపెట్టిన రెండు జట్లూ పదునైన వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి.

 వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించడం అంత తేలిక కాదని రెండో వన్డేతో తేలిపోయింది. లార్డ్స్‌లో ఓటమి భారత్‌ బలహీనతలను బయటపెట్టింది. స్పిన్నర్లు బాగా బౌలింగ్‌ చేసినా.. పేస్‌ బౌలింగ్‌లో వాడి లోపించింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో ధారాళంగా పరుగులిచ్చారు. చివరి ఎనిమిది ఓవర్లలో ఆరు ఓవర్లేసిన ఉమేశ్‌ యాదవ్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, హార్దిక్‌ పాండ్య 62 పరుగులిచ్చారు. భువనేశ్వర్‌, బుమ్రాపై భారత్‌ ఎంతగా ఆధారపడి ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. రెండేళ్లుగా ద్వైపాక్షిక వన్డే సిరీ్‌సల్లో భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఇక ఇంగ్లండ్‌పైనైతే గత ఏడేళ్ల నుంచి ఒక్క సిరీస్‌ కూడా ఓడలేదు. 2017, జనవరిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీ్‌సలో భారత్‌ 2-1తో నెగ్గింది. ఇప్పుడు అదే తరహాలో మరో విజయం కోసం చూస్తోంది. మరోవైపు లార్డ్స్‌లో సాధించిన విజయం ఇంగ్లండ్‌లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. అటు ర్యాంకింగ్‌లోనూ తమ నెంబర్‌ వన్‌ స్థానాన్ని పటిష్ఠం చేసుకుంది.

జట్లు :

భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్),Ms.ధోని(wk),సురేష్ రైనా, రోహిత్ శర్మ, షికార్ ధావన్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, KL రాహుల్, హరిక్ పాండ్య, దినేష్ కార్తీక్, సిద్దార్థ్ కౌల్, మనీష్ పాండే , దీపక్ చహర్, క్రునాల్ పాండ్య.

ఇంగ్లాండ్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్),ఆదిల్ రషీద్,జోస్ బట్లర్(wk), జోన్నీబెయిర్స్టో, లియామ్ ప్లున్కెట్, క్రిస్ జోర్డాన్, జాసన్ రాయ్, డేవిడ్ విల్లీ, అలెక్స్ హాలెస్, జో రూట్, జేక్ బాల్, డావిద్ మలన్, మోయిన్ అలీ, సామ్ కుర్రాన్.

 

 

SHARE