క్రికెట్ పండితులు ఎక్కువ శాతం మంది ఎప్పటికి చెదిరిపోని రికార్డుగా సర్ డాన్ బ్రాడ్మన్ యొక్క 99.94 సగటును భావిస్తారు. అయితే ఈ రికార్డు బద్దలు కొట్టడం అసాధ్యంతో సమానం. ఇటీవలే కాలం స్టీవ్ స్మిత్ చక్కటి ప్రదర్శనలతో టెస్టు క్రికెట్లో ఆకట్టుకున్నపటికి, అతని సగటు కేవలం 62.49.

అయితే ఆ సగటు డాన్ బ్రాడ్మన్ తో పోలిస్తే రెండో వంతు కూడా కాదు. అయితే టెస్ట్ క్రికెట్ తో పోలిస్తే వన్డే క్రికెట్ వేరే రకంగా ఆడతారు. పరుగులు నిర్ణిత ఓవర్లలో సాధించవలసి ఉండటంతో బాట్స్మన్ మాములుగా రిస్క్ ఎక్కువ తీసుకుంటారు. అందుకే వన్డే క్రికెట్లో 40 పై సగటు ఉంటె చాలా మంది బాట్స్మెన్ అని భావిస్తారు.

అయితే అందరికి ఆశ్చర్యం కలిగించేలా వన్డే క్రికెట్ లో అత్యధిక సగటు కలిగిన బాట్స్మెన్ నెథర్లాండ్స్ ఆటగాడు రియాన్ టెన్ డిస్కోటె. అతను తన కెరీర్ లో అద్భుతమైన 67 సగటు నమోదు చేసాడు. ఐపీఎల్ లో కోల్ కతా కింగ్స్ రైడర్స్ కు ఆడిన ఈ అల్ రౌండర్, తన వన్డే కెరీర్ లో 33 మ్యాచ్ లలో 1541 పరుగులు చేసాడు.

వన్ డే క్రికెట్లో కనీసం 20 ఇన్నింగ్స్ ఆడిన వారినుండి ఇతనికే అత్యధిక సగటు ఉంది. సౌత్ ఆఫ్రికా జన్మించిన రియాన్, మొదట్లో సౌత్ ఆఫ్రికా కు ఆడదాం అనుకున్న అతని కల నెరవేరలేదు.

అయితే తన కెరీర్ ను సరైన బాటలో పెట్టుకునేందుకు అతను నెథర్లాండ్స్ సిటిజెన్ షిప్ సాధించాడు. ఆ తరువాత వెలుగులోకి వచ్చిన రియాన్, ప్రపంచం లో ఉన్న అన్ని పెద్ద టీ 20 లీగ్ లలో పాల్గొన్నాడు.

అతని కుడి చేతి మీడియం పేస్ కూడా తాను ఆడిన జట్లకు మంచి ప్లస్ గా మారడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్ లో అతను 33 మ్యాచ్ లలో 55 వికెట్లు తీసి బౌలర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.

అయితే ఇటీవలే జింబాబ్వే లో జరిగిన ప్రపంచ కప్ క్వాలిఫైయర్ లలో ఆడిన రియాన్, అతని జట్టు వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్ కు క్వాలిఫై అవ్వకపోవడం తో అతన్ని ఇంగ్లాండ్ లో చూసే అవకాశం క్రికెట్ అభిమానులకు లేదు. అలానే ఈ ఏడాది ఐపీఎల్ లో కూడా ఏ జట్టు కొనుకోకపోవడం విశేషం.

SHARE