ఇటీవలే మాజీ క్రికెటర్లను సన్మానిస్తున్న ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఏ), మరో సారి అదే ట్రెండ్ ను కొనసాగించింది.

భారత్ దిగ్గజ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ పేరు తో ఫిరోజ్ షా కోట్ల లో ఉన్న ఒక స్టాండ్ పేరు ను బోర్డు మార్చింది. ఈ మధ్య కాలం లో డిడిసిఏ వీరేంద్ర సెహ్వాగ్ పేరు తో ఫిరోజ్ షా కోట్ల ముఖ్య ద్వారాన్ని మార్చగా, బౌలింగ్ చేసే రెండు ఎండ్స్ లో ఒక ఎండ్ పేరును రిటైర్ అయినా ఆశిష్ నెహ్రా కు అంకితం చేశారు.

ఢిల్లీ భారత్ క్రికెట్ జట్టు కు ఎంతో మంది అద్భుతమైన క్రికెటర్లను ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఉన్న జట్టు లో కూడా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ శిఖర్ ధావన్ మరియు ఇషాంత్ శర్మ అంతా ఢిల్లీ నుంచి వచ్చినవారే.

బుధవారం, మాజి మహిళా క్రికెటర్ అంజుమ్ చోప్రా స్టేడియం లో తన పేరు కు మార్చబడిన మూడో గేట్, నాలుగో గేట్ ను తెరిచారు. భారత్ నుంచి ఆరు మహిళా ప్రపంచ కప్ లలో పాల్గొన్న ఏకైక క్రికెటర్ అంజుమ్ చోప్రా, 100 వన్ డే అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన మొదటి భారత్ మహిళా కూడా ఆమెనే.

మరో వైపు బిషన్ సింగ్ బేడీ తనయుడు అంగద్ బేడీ తన తండ్రి పేరు పై డిడిసిఏ స్టాండ్ ను తెరిచిన విషయాన్ని అందరికి ట్విట్టర్ ద్వారా బహిర్గతం చేసాడు.

భారత్ క్రికెట్ కు ఆడిన అత్యుత్తమ స్పిన్నర్లు లో బిషన్ సింగ్ బేడీ ఒకరు. ఆయన భారత్ కు 67 టెస్టులు, 10 వన్ డే మ్యాచ్ లు ఆడారు.

1967 నుండి 1979 మధ్యలో అయన 266 టెస్ట్ వికెట్లు, 7 వన్ డే వికెట్లు తీశారు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆయన తీసిన 1560 వికెట్లు ఇంకా భారత్ చరిత్రలో చెరిగి పోనీ రికార్డు.