టెస్టు క్రికెట్ ఆడటమే చాలా అదృష్టం గా భావిస్తారు చాలా మంది క్రికెటర్లు. అయితే అందులో రికార్డులు సృష్టించడం అంత తేలికైన విషయం. గత 140 సంవత్సరాలుగా ఆడుతున్న ఫార్మటులో ఒక బౌలర్ 300 వికెట్లు తీసాడు అంటే చరిత్రలో నిలిచిపోతాడు, కానీ అదే మైలు రాయి ని అందరికి కంటే వేగగం గా అందుకుంటే చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. అలాంటి టాప్ 5 బౌలర్లు ఎవరో మీరే చుడండి.

5. మాల్కమ్ మార్షల్

1980ల్లో వెస్ట్ ఇండీస్ జట్టు లో అత్యంత ముఖ్యమైన బౌలర్ గా పేరు స్వాధీన మాల్కమ్ మార్షల్, ఆయన వీరోచిత స్పీడ్ బౌలింగ్ కు ప్రసిద్ధి.

తన కెరీర్ లో 378 వికెట్లు సాధించిన మార్షల్, 300 వికెట్ల మైలురాయిని కేవలం తన 61 వ టెస్టు మ్యాచ్ లో సాధించారు.

4. రిచర్డ్ హాడ్లి

న్యూజిలాండ్ చరిత్రలోనే దిగ్గజ బౌలర్ రిచర్డ్ హాడ్లీ, తన అద్భుతమైన కెరీర్ లో 431 వికెట్లు తీశారు. ఆయన క్రికెట్ చరిత్రలోనే ఎంతో పేరు సాధించిన అరుదైన పేస్ బౌలర్.

కేవలం తన 61 వ టెస్టులోనే హాడ్లి 300 వికెట్ల మైలురాయి ని అందుకున్నారు. ఆయన 431 వికెట్ల రికార్డును కపిల్ దేవ్ తర్వాత అధిగమించారు.

3. ముత్తయ్య మురళీధరన్ 

టెస్టు క్రికెట్లో 800 వికెట్లు మైలురాయి అందుకున్న ఏకైక బౌలర్ మురళీధరన్. ఆయన బౌలింగ్ ఏక్షన్, స్పిన్ మంత్రికత్వం తో ఎందరో బాట్స్మన్ ను సతమత పెట్టారు.

క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు సాధించిన ఈ దిగ్గజం 300 వికెట్ల మైలురాయి కేవలం తన 58 వ టెస్టు లో అధిగమించారు.

2. డెన్నిస్ లిల్లీ 

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ 1970 ల్లో తన ప్రతిభ చాటారు. వెస్ట్ ఇండీస్ ప్రపంచ క్రికెట్ లో తమ సత్తా చాటుతుండగా, లిల్లీ ఆస్ట్రేలియా ను ఆ జట్టు సరసన చేర్చారు.

తన కెరీర్ లో 300 టెస్టు వికెట్లు సాదించేందుకు లిల్లీ కు కేవలం 56 టెస్టులు సరిపోయాయి.

1. రవిచంద్రన్ అశ్విన్ 

భారత్ క్రికెట్ లో అశ్విన్ తనకంటూ ఒక పేరు తెచ్చుకోవడం లో సఫలం అయ్యాడు. తాను అరంగ్రేటం చేసినప్పుడు హర్భజన్ సింగ్ భారత్ జట్టుకు కీలక బౌలర్ కాగా, అశ్విన్ కష్టపడి జట్టులోకి వచ్చాడు.

ఇప్పుడు ప్రపంచం లోనే అత్యుత్తమ టెస్టు స్పిన్నర్ గా ఎదిగాడు. అశ్విన్ కేవలం 54 టెస్టుల్లోనే 300 వికెట్ల క్లబ్ లో చేరాడు.

SHARE