డబ్లిన్, జూన్ 30: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా జరిగే తొలి టీ20 కోసం టీమిండియా ఇప్పటికే మాంచెస్టర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. సన్నాహక మ్యాచ్‌లుగా ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకున్న భారత్ మంచి ఊపుమీదుంది. 3రోజుల విరామం అనంతరం జూలై 3 నుంచి ఇంగ్లాండ్‌తో టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్ ఆడనుంది. తర్వాత ఇదే జట్టుతో వన్ డే , టెస్టు సిరీస్‌లోనూ టీమిండియా తలపడుతుంది.

తొలి టీ20కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ- “ఇంగ్లాండ్‌తో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక సిరిస్ కోసం టీమిండియా సిద్ధంగా ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఐర్లాండ్‌పై రెండు టీ-20 మ్యాచ్‌ల్లో నెగ్గినట్టే ఇంగ్లాండ్‌పైనా రాణించి పైచేయి సాధిస్తామని విరాట్ కోహ్లి అన్నాడు” .ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ-20ల్లో 200 పైచిలుకు భారీ స్కోరు సాధించడంలో ఆటగాళ్లు చూపించిన సత్తా తో భారత్ జట్టు ఎంతో ఉత్సాహంగా వుంది.ఇంగ్లాండ్‌తో పోరుకు తమ జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉందని, అందుకు అన్నివిధాలా సన్నద్ధమైందని విరాట్ కోహ్లీ అంటున్నాడు.  ఇదే ఆటతీరు ఇంగ్లాండ్ టూర్‌లో సైతం కనబరుస్తారనే గట్టి నమ్మకం ఉంది’ అన్నాడు.బలమైన ఇంగ్లాండ్ జట్టుతో సిరీస్ తమకు సవాల్ లాంటిదన్నాడు. ‘ప్రత్యర్థి ఎవరన్నది మేం పట్టించుకోం. మా ఆట తీరు మాదే. జట్టులో ఇద్దరు మణికట్టు మాంత్రికులతోపాటు ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్లు ఉన్నారు. వీరితోనే ఢీకొంటాం’ అని కోహ్లీ అన్నాడు. ఈ ఏడాది జరిగిన 11వ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సిద్ధార్థ కౌల్ 21 వికెట్లు తీసుకున్నాడని, శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ-20లో తొలిసారిగా అడుగుపెట్టి రెండు వికెట్లు తీసుకున్నాడన్నాడు. అదేవిధంగా స్పిన్లర్లు యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ 12.3 ఓవర్లలో 70 పరుగులిచ్చి ఆరు పరుగులు తీసుకున్న విషయాన్ని కోహ్లీ గుర్తు చేశాడు.

మరోవైపు ఇంగ్లాండ్ కూడా అంతే ఉత్సాహంతో ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌ను 5-0తో క్లీన్ స్వీస్ చేసింది. దీంతో అదే జోరుని భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌లోనూ కొనసాగించాలని ఇంగ్లాండ్ జట్టు భావిస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో అలెక్స్ హేల్స్, జానీ బెయిర్ స్టో, జాసన్ రాయ్‌, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు.

జట్ల వివరాలు:
ఇండియా:
విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మనీష్ పాండే, ధోని, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్, హార్దిక్ పాండ్యా, సిద్దార్ధ్ కౌల్, ఉమేశ్ యాదవ్

ఇంగ్లాండ్:
ఇయాన్ మోర్గాన్, మెయిన్ అలీ, టామ్ కుర్రాన్, అలెక్స్ హేల్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ ప్లుంకేట్, ఆదిల్ రషీద్, జో రూట్, జాసన్ రాయ్, డేవిడ్ విల్లీ, డావిద్ మాలన్, జానీ బెయిర్ స్టో, జేక్ బాల్, జోస్ బట్లర్.

SHARE