మాంచెస్టర్‌:మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం భారత్‌ తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొనబోతోంది. బలమైన జట్లతో, చక్కటి ఫామ్‌తో బరిలోకి దిగుతున్న భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య రసవత్తర పోరు ఖాయమనిపిస్తోంది.2 నెలలకు పైగా సుదీర్ఘంగా సాగనున్న ఈ పర్యటనలో ఇంగ్లాండ్‌తో టీమ్‌ఇండియా 3 టీ20లు, 3 వన్డేలు, 5 టెస్టులు ఆడుతుంది. సొంతగడ్డపై 5 వన్డేలు, ఏకైక టీ20లో ఆసీస్‌ను చిత్తుగా ఓడించిన ఇంగ్లాండ్‌ జట్టులో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. కాబట్టి ఆతిథ్య జట్టును ఓడించడం భారత్‌కు అంత తేలికేమీ కాదు.

పటిష్ఠంగా ఇంగ్లండ్‌ 
ఇయాన్‌ మోర్గాన్‌ నేతృత్వంలోని ఇంగ్లండ్‌ జట్టు స్టార్‌ ఆటగాళ్లతో కళకళలాడుతోంది. జోస్‌ బట్లర్‌, జేసన్‌ రాయ్‌, హేల్స్‌, బెయిర్‌స్టోలతో కూడిన సూపర్‌ లైన్‌పను నియంత్రించాలంటే భారత బౌలర్లు చెమటోడ్చాల్సిందే. ఈ జట్టు తరఫున అత్యం త వేగంగా అర్ధ సెంచరీ చేసిన రికార్డును బట్లర్‌ సాధించాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో ఆసీ్‌సతో జరిగిన వన్డే సిరీ్‌సలో స్పిన్నర్లు మొయిన్‌ అలీ, రషీద్‌ కలిసి 12 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుత భారత బ్యాట్స్‌మెన్‌లో ఎక్కువ మంది స్పిన్‌ను ఎదుర్కోవడంలో అంత సౌకర్యంగా కనిపించరు. దీంతో ఈ జోడీతో వారికి ఇబ్బంది కలిగే అవకాశాలున్నాయి.

SHARE