కార్డిఫ్‌: కోహ్లీసేన వరుస విజయాలకు ఇంగ్లాండ్ బ్రేక్ వేయాలని చూస్తోంది. ఇందుకోసం గురువారం సోఫియా గార్డెన్స్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ తీవ్ర కసరత్తులు చేసింది. అంతేకాదు తొలి టీ20లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. దీంతో కుల్దీప్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొనాలనే దానిపై ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ దృష్టి సారించారు.ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టును ఇప్పుడు కుల్‌దీప్‌ యాదవ్‌ భయం వెంటాడుతోంది. తొలి టీ20లో ఈ చైనామన్‌ బౌలర్‌ ఐదు వికెట్లతో ఇంగ్లాండ్‌ను బెంబేలెత్తించాడు. దీంతో రెండో టీ20లో అతడిని ఎదుర్కొవడానికి మెర్లిన్‌ అనే బౌలింగ్‌ యంత్రాన్ని ఇంగ్లాండ్‌ రంగంలోకి దింపింది గతంలో షేన్‌వార్న్‌ను ఎదుర్కొవడానికి ఈ బౌలింగ్‌ యంత్రంతోనే ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ ప్రాక్టీస్‌ చేశారు. ఇప్పుడు కుల్‌దీప్‌ కోసం మళ్లీ తెచ్చారు.

రెండో టీ20లో భారత్‌ను ఓడిస్తాం: జోస్ బట్లర్
రెండో టీ20లో టీమిండియాను ఓడిస్తామని ఇంగ్లాండ్ ఓపెనర్ జోస్ బట్లర్ ధీమా వ్యక్తం చేశాడు. రెండో టీ20 నేపథ్యంలో బట్లర్ మాట్లాడుతూ “సిరీస్‌లో ఒక మ్యాచ్‌ మాత్రమే ముగిసింది. అది కూడా టీ20 మ్యాచ్. మేము ఇంకా ఆత్మవిశ్వాసంతోనే ఉన్నాం. కచ్చితంగా రెండో టీ20 మ్యాచ్‌లో పుంజుకుని భారత్‌కి గట్టి పోటీనిచ్చి ఓడిస్తాం” అని అన్నాడు.

SHARE