లీడ్స్‌:ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఒక్కసారిగా జూలు విదిల్చిన ఇంగ్లండ్‌ భారీ విజయంతో జోరు మీదుంది. సమష్టి రాణింపుతో ఆఖరి మ్యాచ్‌లోనూ పైచేయి సాధించడమే కాకుండా టీ20 సిరీస్‌ పరాభవానికి బదులు తీర్చుకోవాలనే కసితో ఉంది.రెండో వన్డేలో విజయం తర్వాత ఇంగ్లండ్‌ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ముఖ్యంగా కుల్దీప్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ ఆ జట్టు 10 ఓవర్లలో 68 పరుగులు రాబట్టడం శిబిరంలో ఆనందం నింపింది. ఇదే జోరులో మరో మ్యాచ్‌ కూడా గెలిచి సిరీస్‌ విజయంతో టి20 లెక్క సరి చేయాలని కెప్టెన్‌ మోర్గాన్‌ భావిస్తున్నాడు. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ గాయపడటంతో అతని స్థానంలో జేమ్స్‌ విన్స్‌ వచ్చే అవకాశం ఉంది. అయితే దూకుడులో రాయ్‌కు సరిపోయే బిల్లింగ్స్‌ కూడా తుది జట్టులో స్థానాన్ని ఆశిస్తున్నాడు. లార్డ్స్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ అన్ని రంగాల్లో సమష్టిగా రాణించి విజయాన్నందుకుంది. హెడింగ్లీలో గత నాలుగు మ్యాచ్‌లు కూడా గెలిచిన ఇంగ్లండ్‌ అదే జోరు సాగిస్తే భారత్‌కు కష్టాలు తప్పవు.

ఇంగ్లాండ్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్),ఆదిల్ రషీద్,జోస్ బట్లర్(wk), జోన్నీబెయిర్స్టో, లియామ్ ప్లున్కెట్, క్రిస్ జోర్డాన్, జాసన్ రాయ్, డేవిడ్ విల్లీ, అలెక్స్ హాలెస్, జో రూట్, జేక్ బాల్, డావిద్ మలన్, మోయిన్ అలీ, సామ్ కుర్రాన్.

SHARE