ఇంగ్లండ్‌ పర్యటనలో టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని చెలరేగుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోనీ ఖాతాలోనూ అరుదైన రికార్డు చేరింది. ఈ మ్యాచ్‌లో అతడు జేసన్‌ రాయ్‌, హేల్స్‌, మోర్గాన్‌, స్టోక్స్‌, బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌లను అందుకున్నాడు. దీంతో ఓ టీ20 మ్యాచ్‌ లో ఐదు క్యాచ్‌లను తీసుకున్న తొలి వికెట్‌ కీపర్‌గా చరిత్రకెక్కాడు. ఆదివారం జరిగిన సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో తన మార్క్‌ కీపింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఏకంగా 5 క్యాచ్‌లు పట్టి కొత్త రికార్డును నమోదు చేశాడు. దీంతో ఒక ఇన్నింగ్స్‌లో 5 క్యాచ్‌లు అందుకున్న తొలి వికెట్‌ కీపర్‌గా ధోని నిలిచాడు. అంతేకాకుండా ఐదు ఔట్లలో భాగమైన అఫ్గాన్‌ వికెట్‌ కీపర్‌ షజాద్‌ రికార్డును ధోని సమం చేశాడు. అయితే అతను 3 క్యాచ్‌లు పట్టి 2 స్టంపింగ్‌లు చేశాడు. సిరీస్ నిర్ణయాత్మక టీ20 మ్యాచ్‌లో వికెట్ల వెనుక ఐదు క్యాచ్‌లు అందుకున్న ధోనీ.. టీ20ల్లో 50 క్యాచ్‌లు అందుకున్న ఏకైక వికెట్‌ కీపర్‌గా నిలిచాడు.

వికెట్ కీపర్ గా టీ20ల్లో టాప్ 5 క్యాచులు పట్టిన ఆటగాళ్లు :

 

SHARE