శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ పై కీలక విజయం సాధించారు. తప్పని సరిగా గెలవాల్సిన మ్యాచ్ లో, ఢిల్లీ జట్టులోని యువ క్రికెటర్లు అలరించారు.

టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నారు రాజస్థాన్ రాయల్స్. అయితే స్టార్ అయిన వెంటనే వర్షం తన ప్రభావం చూపడంతో మరొక గంటన్నరసేపు ఆట ప్రారంభం కాలేదు. దీనితో మ్యాచ్ ను 18 ఓవర్లకు కుదించారు.

బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీ, తొలి ఓవర్లోనే న్యూజిలాండ్ క్రికెటర్ కాలిన్ మన్రో వికెట్‌ను కోల్పోయింది. అయితే యువ సంచలనం పృద్వి షా మరియు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చక్కగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లారు.

Photo Credit: BCCI/IPL

పృద్వి షా కేవలం 25 బంతుల్లో 47 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రిషబ్ పంత్ కూడా చాలా చక్కగా ఆడాడు. కేవలం 29 బంతుల్లో 69 పరుగులు చేసిన రిషబ్ పంత్, జట్టు స్కోర్‌ను పరుగులెత్తించాడు.

ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మరోసారి వర్షం రావడంతో, ఢిల్లీ జట్టు 19.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అయితే చాలా సేపు వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోవడంతో, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు 12 ఓవర్లలో 150 పరుగుల టార్గెట్ నిర్ణయించారు.

బ్యాటింగ్‌కు వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ పవర్‌ప్లే ఓవర్లలో తన సంచలన బ్యాటింగ్‌తో జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. ఒక వైపు డార్సీ షార్ట్ స్పిన్నర్లతో ఆడటానికి తడబడినప్పటికీ, వాట్ల వేగవంతమైన ఇన్నింగ్స్ రాజస్థాన్ జట్టును ముందుకు తీసుకువెళ్లింది.

ఒకసారి పట్ల అవుటైన తర్వాత రాజస్థాన్ రాయల్స్ మిడిల్ ఆర్డర్ పెద్దగా రాణించలేకపోవడంతో జట్టు క్లిష్టమైన స్థితిలో పడింది. అయితే గ్లెన్ మ్యాక్స్ వేసిన పదో ఓవర్లో తొలి మూడు బంతులను మూడు సిక్సర్లుగా మరల్చిన డార్సీ షార్ట్, జట్టును తిరిగి మ్యాచ్‌లోకి తీసుకువచ్చాడు.

చివరిలో కర్నాటక ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతం వేగంగా పరుగులు చేసినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ కేవలం నాలుగు పరుగుల తేడాతో ఈ ముఖ్యమైన మ్యాచ్‌లో ఓటమి పాలయ్యారు.

SHARE