Photo Credit: BCCI/IPL

ఐపీఎల్ 2018 లో సంచలనంగా రాణిస్తూ ప్లే ఆఫ్ కు క్వాలిఫై అయ్యేందుకు చాలా దగ్గరగా ఉన్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఇప్పటికే ఆరు విజయాలు సాధించిన చెన్నై, మరో రెండు విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్ కు చేరుకుంటారు. ఐతే గురువారం వారు కోల్ కతా నైట్ రైడర్స్ పై తలపడనున్నారు.

కోల్ కతా నైట్ రైడర్స్ కూడా చక్కటి ప్రదర్శనలు చేసినప్పటికీ, ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయారు. ఈ మ్యాచ్ లో విజయం చెన్నై కంటే కోల్ కతా కే ముఖ్యం.

పిచ్ రిపోర్ట్

ఈడెన్ గార్డెన్స్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూస్తుంది. రెండో ఇన్నింగ్స్ వచ్చే సమయానికి మారితే మెల్లగా అవ్వడంతో స్కోర్ చేయడం కష్టం అవుతుంది. మరో సారి స్పిన్నర్లులకు అనుకూలమైన పిచ్ ఉండే అవకాశాలు గట్టిగా ఉన్నాయి.

ఈసారి కూడా పిచ్ అదే విధంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఈ ఆటకు వర్షం ఎటువంటి ఆటంకం కలిగించే అవకాశం లేదు. అందుకే ఇరు జట్లలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

టాస్ గెలిస్తే?

సాధారణంగా ఇటీవల కాలంలో టీ 20 క్రికెట్లో టాస్ గెలిస్తే కెప్టెన్లు తొలుత ఫీల్డింగ్ చేసేందుకు ఇష్టపడతారు. అయితే ఈడెన్ గార్డెన్స్ లో మాత్రం తొలుత బ్యాటింగ్ చేస్తేనే జట్టుకు ఆధిపత్యం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి.

ఎందుకంటే రెండో ఇన్నింగ్స్ ప్రారంభం అయ్యేసరికి పిచ్ మరింత మెల్లగా అవ్వడంతో స్పిన్నర్లు మరింత కీలక పాత్ర పోషిస్తారు. దీనితో టాస్ గెలిస్తే దినేష్ కార్తిక్ లేదా మహేంద్ర సింగ్ ధోనీ, ముందు బ్యాటింగ్ చేసేందుకే ఇష్టపడతారు.

కీలక ప్లేయర్లు

ముంబయితో జరిగిన తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఒంటి చేత్తో గెలిపించాడు ఆల్రౌండర్ డ్వెయిన్ బ్రావో. తరువాత కూడా బాట్ మరియు బంతి తో మంచి ఫామ్ ను కనబరుస్తున్నాడు. అతను బౌలింగ్ లో అద్భుతంగా రాణించగా బ్యాటింగ్లో సంచలనమే సృష్టించాడు. కోల్ కతా పై జరుగనున్న ఈ మ్యాచ్ లో బ్రేవో ముఖ్య భూమిక పోషించాలి.

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు అత్యంత ముఖ్యమైన ఆటగాడు సునీల్ నరేన్. అతను కేవలం బంతితోనే కాకుండా బ్యాట్తో కూడా ఐపీఎల్ లో విప్లవం సృష్టిస్తున్నాడు. ఐతే ఈ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించాలి అంటే, నరైన్ భాగం ముఖ్యం కానుంది. చెన్నై మిడిల్ ఆర్డర్ వికెట్లు తీయాల్సిన బాధ్యత కూడా ఆతని పైనే ఎక్కువగా ఉంటుంది.

మ్యాచ్ అంచనా

కోల్ కతా నైట్ రైడర్స్ చక్కటి ఫామ్ కనబరిచినప్పటికీ, దినేశ్ కార్తిక్ తన సొంత గ్రౌండ్లో పరాజయం సాధిస్తాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఫామ్ వేరే స్థాయి లో ఉంటడంతో వారు మరో సారి ఈ మ్యాచ్ లో విజయం సాధించే అవకాశాలు మెండు గా ఉన్నాయి.

SHARE