టెస్టు క్రికెటర్ చతేశ్వర్‌ పుజారా భారత క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యధిక డబల్ సెంచరీలు చేసిన భారత బాట్స్మన్ గా రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించాడు.

ప్రస్తుతం జారుతున్న రంజీ ట్రోఫీ లో సౌరాష్ట్ర కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా, గ్రూప్ బి లో జార్ఖండ్ తో జరిగిన మ్యాచ్ లో డబుల్ సెంచరీ సాధించి తన పేరు మీద 12 వ ద్విశతకం సాధించాడు. దానితో ఇన్నాళ్లు ఉన్న విజయ్ మర్చంట్ 11 డబుల్ సెంచరీల రికార్డు ను బాధలు కొట్టాడు.

Indian cricketer Vijay Merchant (1911 – 1987) batting against England during the Third Test at The Oval, London, 18th August 1946. (Photo by Central Press/Hulton Archive/Getty Images)

గత సంవత్సరం ఫస్ట్ క్లాస్ సీజన్ లో అత్తదికా పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన పుజారా, ఈ ఏడాది మరో రికార్డు తన ఖాతా లో వేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ ఆతడు తన 42 వ ఫస్ట్ క్లాస్ సెంచరీ కూడా నమోదు చేసాడు.

భారత దిగ్గజాలు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రావిడ్ మరియు విజయ్ హజారే 10 డబుల్ సెంచరీలతో మూడో స్థానం లో ఉన్నారు.

మొదటి రెండు రంజీ మ్యాచ్లలో విఫలం అయినా పుజారా, వచ్చే శ్రీ లంక సిరీస్ కోసం రంజీ ట్రోఫీ ద్వారా సన్నద్ధం అవుతున్నాడు. హర్యానా మరియు జమ్మూ కాశ్మీర్ పై కేవలం 48 పరుగులు చేసిన పుజారా, జార్ఖండ్ పై 204 పరుగులు చేసి షాదాబ్ నదీమ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

ఆయన డబుల్‌ సెంచరీ చేయడంతో సౌరాష్ట్ర భారీ స్కోరు సాధించింది. రాగ్‌ జాని (108) కూడా చక్కటి ఇన్నింగ్స్ ఆడటం తో సౌరాష్ట్ర తొలి ఇనింగ్స్ ను 553/9 వద్ద డిక్లేర్‌ చేసింది.

ఇంకో ఆరుదిన రికార్డు ఏంటంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మూడు ట్రిపుల్ సెంచరీలు చేసిన బాట్స్మన్ కూడా పుజారా నే. అయితే రవీంద్ర జడేజా కూడా మూడు ట్రిపుల్ సెంచరీలతో పుజారా తో సమం గా ఉన్నాడు.

పుజారా ఇదే ఫామ్ ను శ్రీ లంక పై ఆ తర్వాత వచ్చే క్లిష్టమైన సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ టూర్ ల లో కనబర్చాలి అని కోరుకుందాం.

SHARE