భారత్ క్రికెట్ జట్టులో స్థానాల కోసం ఇటీవలే ఏర్పడుతున్న పోటీ మనందరికి తెలిసినదే. ఐతే తన కెరీర్ లోనే అత్యద్భుతమైన ఫామ్ లో ఉన్న దినేష్ కార్తీక్ మరో సారి భారత్ జట్టులో స్థానం సంపాదించగలిగాడు.

ఇప్పటికే తన సంచలమైన ఫామ్ తో వన్డే, టీ 20 ఫార్మాట్లలో జట్టులో స్థానం సాధించిన కార్తీక్, తన సెలక్షన్ కు న్యాయం చేసాడు. మొన్ననే ముగిసిన ఐపీఎల్ లో అద్భుతమైన ఫామ్ కనబరిచాడు దినేష్ కార్తీక్. అంతకు ముందు జరిగిన నిదాహస్ ముక్కోణపు సిరీస్ లో కూడా ఆఖరి బంతిని సిక్స్ గా మరల్చి తన సెలక్షన్ పై ఉన్న అనుమలకు సమాధానం చెప్పాడు.

Kolkata: Kings XI Punjab cricketer Wriddhiman Saha at the practice session during 10th edition of IPL at Eden Garden in Kolkata on Wednesday. PTI Photo by Ashok Bhaumik(PTI4_12_2017_000123B)

ఐతే టెస్ట్ జట్టులో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సహా కు వేలి గాయం కావడం తో, ఈ నెల ఆఫ్ఘానిస్తాన్ పై జరగున్న టెస్ట్ కు అతడు అందుబాటు లో లేకపోయాడు. దీనితో అతని స్థానం భర్తీ చేయడనికి దినేష్ కార్తీక్ ను ఎంపిక చేసారు మన నేషనల్ సెలెక్టర్లు.

సన్ రైజర్స్ హైదరాబాద్ కు కోల్ కతా నైట్ రైడర్స్ పై ఆడుతూ మే 25 న జరిగిన రెండవ క్వాలిఫైయర్ లో సహా తన వెలికి బొటను వెలికి గాయం చేసుకున్నాడు. దీనితో అతను ఐపీఎల్ ఫైనల్ కూడా ఆడ లేకపోయాడు. ఐతే టెస్టు జట్టులో తన స్థానం పదిలం చేసుకోవడానికి దినేష్ కార్తీక్ కు ఇది మంచి అవకాశం.

భారత్ టెస్టు జట్టు లో ఆఖరి సారి 2010 లో ఆడిన కార్తీక్, ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటే అతను మరో సారి అన్ని ఫార్మాట్లలో భారత్ జట్టుకు కీలకం కన్నునాడు. మరో వైపు ఆఫ్ఘానిస్తాన్ పై జరగనున్న టెస్ట్ పై అందరి ద్రుష్టి మళ్లింది. ఇటీవలే ఐపీఎల్ తో వేసవి ని బాగా ఆస్వాదించిన క్రికెట్ అభిమానులు, ఆఫ్ఘానిస్తాన్ టెస్ట్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు.

India’s Dinesh Karthik celebrate scoring half a century against West Indies in his partnership with captain India’s captain Virat Kohli during the fifth ODI at the Sabina Park cricket ground in Kingston, Jamaica, Thursday, July 6, 2017. India won the match by 8 wickets and the series 3-1.(AP Photo/Ricardo Mazalan)

ఐతే ఆఫ్ఘానిస్తాన్ చరిత్రలోనే ఇది వారి తొలి టెస్టు మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ పై చాలా మంది క్రికెట్ అభిమానుల ద్రుష్టి పడింది. ఈ మ్యాచ్ లో పాల్గొనడంతో అంతర్జాతీయ క్రికెట్ లో 12 వ టెస్ట్ జట్టుగా రెకార్డుకెక్కనుంది.

ఐపీఎల్ లో కూడా రషీద్ ఖాన్, మహమ్మద్ నబి, ముజీబ్ రెహమాన్ లాంటి ఆఫ్ఘన్ ఆటగాళ్లు బాగా ఆడి భారత అభిమానుల మన్ననలు పొందిన వారే. తొలి టెస్ట్ మ్యాచ్ ఆడటం తో వారి క్రికెట్ పయనంలో మరో మైలురాయిని అందుకోనున్నారు ఆఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు. ఈ మ్యాచ్ ఈ నెల 14 న బెంగళూరు లోని చిన్న స్వామి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కాన్నుంది.

SHARE