భారత జట్టు స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ త్వరలోనే ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. మైదానం లో తన వీరోచిత ప్రదర్శనలతో, తనకంటూ ఒక ప్రత్యేక పేరు తెచ్చుకున్న భువీ ఇప్పుడు పెళ్లి చేసుకున్న క్రికెటర్ల సరసన చేరనున్నాడు.

ఐపీల్ జరుగుతున్న సమయంలో భువీ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో డిన్నర్‌ డేట్‌కు వెళ్లిన సందర్భంలో ఒక ఫోటో అప్లోడ్ చేసాడు. అయితే ఆ ఫొటోలో తాను మాత్రమే కనపడేలా క్రోప్ చేసి పెట్టి, త్వరలోనే పూర్తి చిత్రం పెడతాను అని కాప్షన్ రాసాడు.

Dinner date ? full pic soon ?

A post shared by Bhuvneshwar Kumar (@imbhuvi) on

ఐతే ఆ ఫోటో చాలా వైరల్ అయ్యి ఎన్నో ఊహగానాలకు తెర తీసింది. ఆ చిత్రం లో ఉన్న అమ్మాయి సినీ నటి అనుస్మృతి సర్కార్‌ అని చాలా వదంతులు కూడా ఇంటర్నెట్ లో హల చల్ చేసాయి. చివరికి ఆ వార్తలు అన్ని తప్పు అనే విధంగా పూర్తి చిత్రాన్ని విడుదల చేసాడు.

భువీకు కాబోయే అమ్మాయి పేరు నుపుర్‌ నగార్‌. ఐతే ఇంతకు మించి ఎటువంటి వివరాలను భువనేశ్వర్ కుమార్ ఫాన్స్ కు చెప్పలేదు.

Here’s the better half of the picture @nupurnagar ??

A post shared by Bhuvneshwar Kumar (@imbhuvi) on

ఈ ఏడాది చివర్లో వివాహం జరగొచ్చు అని వార్తలు మళ్ళీ ఇంటర్నెట్ లో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఐతే భువీ మాత్రం ఇంకా ఏమి వెల్లడించలేదు.

ఆస్ట్రేలియా సిరీస్ లో మళ్ళీ చక్కటి ప్రదర్శన చూపించిన, భువనేశ్వర్ ఇప్పుడు ఈ ఆదివారం మొదలయ్యే టీ 20 సిరీస్ కు సన్నద్ధం అవుతున్నాడు. ఒన్డే మరియు టీ 20 ఫార్మాట్లలో భువనేశ్వర్ కుమార్, విరాట్ కోహ్లీకు చాలా కీలక బౌలర్ గా మారాడు.