వచ్చే ఏడాది జనవరి లో ప్రారంభమయ్యే అండర్ 19 ప్రపంచ కప్ కు తుది జట్టు ను భారత్ క్రికెట్ బోర్డు బిసిసిఐ నేడు విడుదల చేసింది.

ముంబై కు చెందిన పృథ్వి షా ఈ సారి జరగబోయే కప్ లో భారత్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. పంజాబ్ కు చెందిన శుబ్ మాన్ గిల్ ను వైస్ కెప్టెన్ గా ప్రకటించారు. అయితే ఈ ఇరువురు ఇటీవలే జరిగిన ఆసియా కప్ లో పాల్గొనకపోవడం గమనార్హం.

సెలెక్టర్లు ఆర్యన్ జుయల్ ను రెండో వికెట్ కీపర్ గా జట్టు లోకి ఎంపిక చేసారు. తొలి ఛాయిస్ గా హర్విక్ దేశాయ్ వికెట్ కీపింగ్ భాద్యతలు చెప్పటనున్నాడు.

న్యూజిలాండ్ లో జరగబోతున్న ఈ ఎడిషన్ కు భారత్ అండర్ 19 జట్టు సన్నద్ధం కావడానికి బోర్డు బెంగుళూరులో డిసెంబర్ 8 నుండి 22 వరకు ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసింది. తుది జట్టు మొత్తం క్యాంపు లో శిక్షణ ప్రారంభిస్తారు అయితే కెప్టెన్ షా మరియు బెంగాల్ పేస్ బౌలర్ ఇషాన్ పోరెల్ మాత్రం శిక్షణ శిబిరానికి డిసెంబర్ 12 కు చేరుకుంటారు.

ఈ ఇరువురు తమ జట్లలో రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ లో పాల్గొంటారు అని తెలుస్తుంది. అలానే సెలెక్టర్లు ఓం బోస్లే, రాహుల్ చాహర్, నినాద్ రత్వా, ఉర్విల్ పటేల్ మరియు ఆదిత్య థాకరే ను స్టాండ్ బై ఆటగాళ్లగా ప్రకటించారు. ఒక వేళా తుది జట్టు లో ఎవరికైనా గాయం అయితే వెంటనే వీరే లో ఒకరిని జట్టు లో ఆడేందుకు పంపిస్తారు.

ఇప్పటి వరకు భారత్ అండర్ 19 ప్రపంచ కప్ ను 2000 , 2008 ,2012 లో గెలుచుకోగా, 2016 లో జరిగిన ఎడిషన్ లో రన్నర్ అప్ గా నిలిచారు. కేవలం ఆస్ట్రేలియా మాత్రమే ఈ టోర్నమెంట్ ను మూడు సార్లు గెలుచుకుంది.

అండర్ 19 జట్టు: పృథ్వీ షా (C), షబ్మన్ గిల్ (VC), మంజోత్ కల్ర, హిమాంశు రాణా, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ఆర్యన్ జ్యాయల్ (WK), హార్విక్ దేశాయి (WK), శివం మావి, కమలేష్ నాగార్కోటి, ఇషాన్ పోరేల్, అర్ష్దీప్ సింగ్, అనుకుల్ రాయ్, శివ సింగ్, పంకజ్ యాదవ్

SHARE