సౌత్ ఆఫ్రికా పై జరిగే మూడు టీ 20 మ్యాచ్ సిరీస్ కు బిసిసిఐ ఈ రోజు తుది జట్టును ప్రకటించింది. ఇటీవలే జరిగిన సయెద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో అద్భుతంగా రాణించిన సురేష్ రైనాను నేషనల్ సెలెక్టర్లు తిరిగి భారత్ జట్టుకు ఎంపిక చేశారు.

ఇప్పటివరకు అంతర్జాతీయ టీ 20 మ్యాచ్ ఆడని శార్తుల్ ఠాకూర్ కు సెలెక్టర్లు మొగ్గు చూపగా, శ్రీలంక పై అరంగ్రేటం చేసిన శ్రేయాస్ ఐయర్ జట్టు నుండి స్థానం కోల్పోయాడు.

భారత్ కు ఆఖరి సారి గత ఏడాది జనవరి లో ఇంగ్లాండ్ పై ఆఖరి సారి టీ 20 ఆడిన సురేష్ రైనా, యో యో టెస్ట్ లో పాస్ అయ్యాక చక్కటి ప్రదర్శనలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. రంజీ ట్రోఫీ అంతగా ఆకట్టుకోనప్పటికీ, సయెద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో 314 పరుగులు చేసాడు. వీటిలో వరుసగా రెండు అర్ధ శతకాలు మరియు అజేయవంతమైన 126 సాధించాడు.

భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు. సొంత గడ్డ పై శ్రీ లంక పై జరిగిన టీ 20 సిరీస్ కు విశ్రాంతి కల్పించిన సెలక్టర్లు, సౌత్ ఆఫ్రికా సిరీస్ కు మరల జట్టులోకి ఎంపిక చేసారు. అలానే భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా విశ్రాంతి తరువాత టీ 20 ల్లో ఆడనున్నాడు.

టెస్ట్ సిరీస్ ను 2-1 తో ఓడిపోయిన భారత్, ఫిబ్రవరి 1 నుండి 6 మ్యాచ్ల వన్ డే సిరీస్ లో ఆడనుంది. ఆ తరువాత జొహ్యానెస్బర్గ్, సెంచురీన్ మరియు కేప్ టౌన్ లో మూడు టీ 20 మ్యాచ్లు ఆడనున్నారు.

సౌత్ ఆఫ్రికా సిరీస్ కు భారత్ తుది జట్టు: విరాట్ (కెప్టెన్), రోహిత్ (VC), శిఖర్ , కెఎల్ రాహుల్, రైనా, ధోని (wk), దినేష్ కార్తీక్, హరిక్, మనీష్, ఆక్సార్, చహల్, కుల్దీప్, భువనేశ్వర్, బుమ్రా, ఉనాద్కాట్, శార్తుల్ ఠాకూర్

SHARE