ఇటీవలే ప్రకటించిన ఐసీసీ టీ 20 ర్యాంకుల్లో పాకిస్తాన్ బాట్స్మన్ బాబర్ అజాం తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తో జరిగిన ట్రై సిరీస్ లో చక్కగా రాణించిన ఆసీస్ బాట్స్మెన్ ఆరోన్ ఫించ్, రెండో స్థానాన్ని సాధించాడు.

తద్వారా భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానానికి పడిపోయాడు. పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజాం 786 రేటింగ్ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా, మిడిల్ ఆర్డర్ లో చక్కగా ఆడిన ఆరోన్ ఫించ్ 784 పాయింట్లతో రెండో స్థానాన్ని సాధించాడు.

ఐతే ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న టీ20 సిరీస్ లో వన్డే సిరీస్ లో చూపించిన ఫామ్ చూపలేకపోయిన విరాట్ కోహ్లీ, మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కేవలం 2 టీ 20 మ్యాచుల్లో 27 పరుగులే చేసిన విరాట్ కోహ్లీ, 773 రేటింగ్ పాయింట్లకు పడిపోయాడు. అయితే చివరి టీ 20 లో మంచి ప్రదర్శన చేస్తే మరల పైకి వెళ్ళే అవకాశం లేకపోలేదు.

ట్రై సిరీస్ లో తన అద్భుతమైన పెరఫార్మన్సులు చేసిన న్యూజిలాండ్ ఓపెనర్ కోలిన్ మున్రో మాత్రం నాలుగో స్థానంతో సరిపెట్టుకోవలసివచ్చింది. అతను 773 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతారు.

తాజా టీ 20 బాట్స్మన్ ర్యాంకింగ్స్

Pos Player Rating
1 బాబర్ అజాం PAK 786
2 ఆరోన్ ఫించ్  AUS 784
3 విరాట్ కోహ్లీ  IND 776
4 కోలిన్ మున్రో  NZ 773
5 ఎవిన్ లెవీస్  WI 734
6 కే ఎల్ రాహుల్  IND 726
7 గ్లెన్ మాక్స్వెల్  AUS 700
8 అలెక్స్ హెల్స్  ENG 690
9 జో రూట్  ENG 683
10 హషిమ్ ఆమ్లా  SA 683

 

బౌలర్లు ర్యాంకుల్లో న్యూజిలాండ్ స్పిన్నర్ మిట్చెల్ సంట్నర్ తొలి స్థానాన్ని సాధించాడు. ఆఫ్గనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ రెండో స్థానంలో ఉండగా, భారత్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగో స్థానం లో కొనసాగుతున్నాడు.

తాజా టీ 20 బౌలర్ ర్యాంకింగ్స్

Pos Player Rating
1 మిట్చెల్ సంట్నర్ NZ 718
2 రషీద్ ఖాన్  AFG 717
3 ఐష్ సోది  NZ 712
4 జస్ప్రీత్ బుమ్రా  IND 702
5 శామ్యూల్ బద్రి  WI 691
6 ఇమ్రాన్ తాహిర్  SA 691
7 ఇమాద్ వసీం  PAK 677
8 ముస్తాఫిజుర్ రెహమాన్  BAN 667
9 జేమ్స్ ఫాల్కన్ర్  AUS 661
10 షకీబ్ అల్ హాసన్  BAN 661

 

SHARE