హరారే : ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ టీ20ల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్ 76 బంతుల్లో 16 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 172 పరుగులు నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. ఫించ్‌కు అంతర్జాతీయ టీ20ల్లో ఇది రెండో సెంచరీ కావడం విశేషం. 2013 అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లాండ్‌పై 156 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్ తన రికార్డును తనే మెరుగుపర్చుకున్నాడు. టీ20ల్లో వరుసగా మూడో అర్ధ సెంచరీ సాధించిన రెండో ఆసీస్ క్రికెటర్‌గా ఫించ్ రికార్డ్ నెలకొల్పాడు. గతంలో షేన్ వాట్సన్ (2011-12లో) మాత్రమే టీ20ల్లో తరఫున ఈ ఫీట్ సాధించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఏకైక టీ20లో 41 బంతుల్లో 84 పరుగులు చేసిన ఫించ్.. గత మ్యాచ్‌లో పాక్‌పై 33 బంతుల్లో 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టీ20 లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ గేల్ (175*) పేరిట ఉంది.

 

 టీ20ల్లో ఆత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాట్స్‌మెన్
* Aaron Finch: 172 off 76 balls: Aus v Zim, Harare, 2018
* Aaron Finch: 156 off 63 balls: Aus v Eng, Southampton, 2013
* Glenn Maxwell: 145 off 65 balls: Aus v SL, Pallekele, 2016
* Evin Lewis: 125 off 62 balls: WI v India, Kingston, 2017
* Shane Watson: 124 off 71 balls: Aus v India, Sydney, 2016

SHARE