భారత్ పై జరిగిన ముక్కోణపు సిరీస్ తొలి టీ 20 ను శ్రీలంక అలవోకగా విజయాన్ని చేరింది. టాస్ ఓడి బాటింగ్ కు దిగిన భారత్ జట్టు కు ఆది లోనే దెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ, సురేష్ రైనా ఇద్దరు తొలి రెండు ఓవెన్లలోనే అవుట్ అయ్యారు.

కానీ శిఖర్ ధావన్ తన అనుభవాన్ని జోడించి చక్కటి 90 పరుగులు చేసాడు. భారత్ ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 20 ఓవర్లలో 174 పరుగులు చేసారు. ధావన్ మినహా బాటింగ్ లో ఎవరు రాణించలేకపోవడం విశేషం.

Shikhar Dhawan of India celebrates his Hundred runs during the 3rd One Day International between India and Sri Lanka held at the The ACA-VDCA Stadium, Visakhapatnam on the 17 December 2017
Photo by Deepak Malik / BCCI / Sportzpics

భారీ టార్గెట్ ను ఛేదించడానికి వచ్చిన శ్రీలంక కు మొదట్లోనే స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఆడ్డుకట్ట వేసాడు. రెండో ఓవర్లో ఓపెనర్ కుశాల్ మెండిస్ అవుట్ చేసిన భారత్ జట్టు, తరువాత వచ్చిన కుశాల్ పెరీరా ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోయారు.

ఒకే ఓవర్ లో శార్దూల ఠాకూర్ ను 27 పరుగులకు బాదిన పెరీరా, తాను అవుట్ అయ్యే సమయానికి మ్యాచ్ శ్రీలంక వైపు మొగ్గేలా చేసాడు. అతను కేవలం 37 బంతుల్లో 66 పరుగులు చేసి శ్రీలంక కు రెండేళ్లలో భారత్ పై తొలి టీ 20 విజయం సాధించాడు.

మ్యాచ్ తరువాత మాట్లాడుతూ భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ: “174 పరుగులు ఈ గ్రౌండ్ పై సరిపడే స్కోరే, తప్పకుండ మేము గెలవాల్సిన మ్యాచే. బాటింగ్ ఆడే తప్పుడు ఆఖరి ఓవర్లలో మేము మరిన్ని పరుగులు చేయలేకపోయాం.

“వారికి పవర్ ప్లే లో లభించిన పరుగులు రెండు జట్ల మధ్య డిఫరెన్స్ అయ్యింది. క్రెడిట్ అంతా శ్రీలంకదే, వారి బాట్స్మెన్ సంచలనంగా ఆడారు. అయితే మేము చేసిన తప్పులు నుండి మేము నేర్చుకొని వచ్చే మ్యాచ్ లో బాగా ఆడేందుకు ప్రయత్నిస్తాం.”

SHARE