శ్రీలంక క్రికెట్ ఆడే దేశాల్లో చాలా మంచి జట్టు అయితే భారత్ తో ఆడిన చాలా సార్లు వారు క్రీడా స్ఫూర్తి లేని సంఘటనల్లో పాల్గొన్నారు.

జెంటిల్ మాన్ ఆట గా పేరు పొందిన క్రికెట్ లో అప్పుడప్పుడు స్ఫూర్తికి విరుద్ధం గా సంఘటనలు జరుగుతాయి. అయితే లంక భారత్ పై ఇలాంటివి చాలానే చేసింది అని చెప్పాలి. శ్రీ లంక భారత్ ను మోసం చేసిన టాప్ 5 సంఘటనలు ఇక్కడ చూద్దాం.

#5. ఈడెన్ గార్డెన్స్ లో అవసరం లేకపోయినా ఫిజియో గ్రౌండ్ లోకి రావడం

ఈ సిరీస్ లో జరిగిన మొదటి టెస్టు లో రెండు రోజుల ఆట వర్షం కారణం గా పోయినప్పటికీ భారత్ తమ సత్తా చాటి మ్యాచ్ ను గెలుపు దిశగా తీసుకు వెళ్ళింది.

కానీ శ్రీలంక మ్యాచ్ ను డ్రా చేసేందుకు ఎన్నో మోసపూరిత ప్లాన్లు వేసింది. తొలుత డిక్ వెల్ల షమీ బౌలింగ్ లో అనవసరం గా వేషాలు వేయగా, చివర్లో ఎలాగైన మ్యాచ్ డ్రా చేసేందుకు సమయం వృధా చేయడానికి లంక తమ ఫిజియో ను గ్రౌండ్ పైకి పంపారు. అయితే అంపైర్లు అతనిని వెనక్కి పంపడం తో వారి పరువు పోయింది.