భారత్ క్రికెట్ జట్టుపై పాకిస్తాన్ 124 పరుగులతో ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్ ఓడినప్పుడు, ఆ దేశంలో వీరాభిమానులు కూడా పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తుంది అని భావించలేదు. అయితే భారత్ తో తలపడిన మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ జట్టు ఆత్మవిశ్వాసం తో ఆది రెండో స్థానం లో గ్రూప్ స్టేజి నుంచి సెమీఫైనల్స్ చేరుకుంది.

సెమీ ఫైనల్స్ లో ఆతిధ్య జట్టు ఇంగ్లాండ్ ను అలవోక ఓడించి ఫైనల్స్ లో టైటిల్ ఫేవరెట్ భారత్ తో మ్యాచ్ ఖరారు చేసుకున్నారు. అయితే ఫైనల్ కు ముందు పాకిస్తాన్ కు ఎవరు గెలుస్తారు అనే అవకాశం ఇవ్వలేదు. భారత్ జట్టు ఫామ్ చూసి అంత భారత్ ఏయ్ గెలుస్తుంది అని భావించారు. కానీ అందరి అంచనాలను తల క్రిందులు చేస్తూ, పాక్ చాలా సులువుగా ఇండియా ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ సొంతం చేసుకున్నారు.

టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, ఫాఖర్ జమాన్ అద్భుత సెంచరీ వాళ్ళ 339 పరుగులు నమోదు చేసారు. తర్వాత బాటింగ్ కు వచ్చిన భారత్, మహమ్మద్ అమిర్ సంచలన బౌలింగ్ స్పెల్ వలన టాప్ ఆర్డర్ అంత విఫలం అయ్యారు. భారత్ కేవలం 158 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయ్యారు.

అయితే పాక్ విజయం తర్వాత అంతా షాక్కు గురిచెందగా, పాకిస్తాన్ క్రికెట్ టీం మేనేజర్ అలీ మాలిక్ భారత క్రికెట్ దిగజం గవాస్కర్, రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యల వల్ల పాక్ అంత బాగా ఆడింది అని చెప్పారు.

“ఇండియా గెలుస్తుంది అని అంత భావించారు. సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి అయితే పాకిస్తాన్ కు గెలిచే అవకాశమే ఇవ్వలేదు. ఇది పాక్ క్రికెటర్స్ పై చాలా ప్రభావం చూపించింది. ఆటగాళ్లు అంత బాట్, బాల్ మాట్లాడనిదాం అని అనుకున్నారు,” ఆయన చెప్పారు.

“భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎందుకు ఎంచుకున్నారో తెలీదు. కానీ మేము మంచి పరుగులు సాధిస్తే మాకు ఉన్న బౌలింగ్ తో మ్యాచ్ గెలవొచ్చు అనే నమ్మకం మాకు ఉంది,” అని మాలిక్ చెప్పారు.

 

SHARE