Hardik Pandya of India departs during day four of the first Sunfoil Test match between South Africa and India held at the Newlands Cricket Ground in Cape Town, South Africa on the 8th January 2018 Photo by: Ron Gaunt / BCCI / SPORTZPICS

సౌత్ ఆఫ్రికా పై సెంచూరియన్ లో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఆతిధ్య జట్టును తొలి ఇన్నింగ్స్ లో 335 కు అల్ అవుట్ చేసి ముందజ వేసింది.

అయితే సౌత్ ఆఫ్రికా బౌలర్లు తమదైన శైలిలో పుంజుకొని, తొలుతనే రెండు వికెట్లు తీశారు. అయితే విరాట్ కోహ్లీ చక్కగా రాణించి సెంచరీ సాధించగా, మరో వైపు బాట్స్మన్ మాత్రం ఎటువంటి సహకారం ఇవ్వలేదు.

రెండో రోజు చివరి సెషన్ లో చక్కగా ఆడిన హార్దిక్ పాండ్య, మూడో రోజు తొలి సెషన్ లో కూడా బౌలర్లను చక్కగా ఎదుర్కున్నాడు. అయితే కగిసో రబడా వేసిన 67 వ ఓవర్ లో తొలి బంతిని మిడ్ ఆన్ దిశగా కొట్టిన హార్దిక్, పరుగు కోసం ప్రయత్నించి తిరిగి క్రీజ్ లోకి మెల్లగా వెళ్ళాడు.

కానీ ఫీల్డింగ్ చేస్తున్న వెర్నాన్ ఫిలాండర్ వికెట్ ను డైరెక్ట్ హిట్ చేయడం తో, బద్దకంగా తిరిగి వెళ్తున్న హార్దిక్ , చాలా హాస్యపదం గా రన్ ఔట్ అయ్యాడు. అయితే సమయానికి క్రీజ్ లో తన బాట్ అనచని పాండ్య, ఈ సంఘటన నుండి చాలా నేర్చుకుంటాడు అని ఆసిదాం.

హార్దిక్ పాండ్య రన్ అవుట్ కావడంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు ఆధిక్యత లభించే అవకాశం చేజారింది.  కానీ విరాట్ కోహ్లీ ఇంకా బౌలర్లతో కలిసి ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అయితే భారత్ కనీసం సౌత్ ఆఫ్రికా చేసిన 335 దగ్గరకు రాగలదా అనేది విరాట్ కోహ్లీ పైనే ఇంకా ఆధారపడి ఉంటుంది.

హార్దిక్ పాండ్య రన్ అవుట్ ను మీరే చుడండి

SHARE