Virat Kohli (captain) of India celebrates his half century, fifty runs during the 6th One Day International match between South Africa and India held at Supersport Park Cricket Ground in Centurion on the 16th Feb 2018 Photo by Ron Gaunt / BCCI / SPORTZPICS

మాజీ పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది, మంగళవారం తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కాశ్మీర్ వివాదం పై చేసిన కామెంట్లు ఇంటర్ నెట్ లో సంచలనం రేపుతున్నాయి.

38 ఏళ్ళు కలిగిన ఆఫ్రిది, ఐక్య రాజ్య సమితి లాంటి పెద్ద పెద్ద సంస్థలు భారత్ కాశ్మీర్ లో చేస్తున్న అరాచకాల పై ఎందుకు స్పందించడం లేదు అని ప్రశించాడు. ఐతే అతను చేసిన కామెంట్లు భారత్ సెలెబ్రిటీల నుండి విమర్శలకు దారి తీస్తున్నాయి.

1947 లో భారత్, పాకిస్తాన్ విడిపోయిన సమయంలో ఏర్పడిన కాశ్మీర్ సమస్య, ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఇంకా సర్దుమణగలేదు. ఇప్పటికే చాలా సార్లు కాశ్మీర్ కోసం భారత్ పై యుద్ధానికి వచ్చిన పాకిస్తాన్, ఎప్పుడు గెలిచినా దాఖలాలు లేవు. ఐతే కాశ్మీర్ వ్యాలీ మెల్లగా భారత్ లో ఒక ముఖ్యమైన రాష్ట్రంగా మారిన విషయం కూడా అందరికి తెలిసినదే.

“భారతీయ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్న భయభరితమైన పరిస్థితి చూస్తే భయం వేస్తుంది. స్వీయ-నిర్ణయం & స్వాతంత్రం యొక్క గొంతును అణిచివేసేందుకు అణచివేత పాలన ద్వారా అమాయకులు కాల్చబడతాయి. ఐక్య రాజ్య సమితి మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలు ఎందుకు ఈ రక్తపాతం ఆపడానికి ప్రయత్నాలు చేయడం లేదు? ” అని ఆఫ్రిది తన ట్వీట్లో పేర్కొన్నాడు.

ఒక భారతీయుడిగా, నా దేశానికి ఉత్తమమైనది నేను వ్యక్తపరచాలని కోరుకుంటాను. నా ఆసక్తులు ఎల్లప్పుడూ నా దేశం యొక్క ప్రయోజనం కోసమే ఉంటాయి. ఎవరైనా వ్యతిరేకించినట్లయితే, నేను ఖచ్చితంగా ఖండిస్తాను. ”

“కానీ కొన్ని విషయాల గురించి ఎవరైనా వ్యాఖ్యానించడానికి వారి వ్యక్తిగత విషయం. నేను ఏదయినా సమస్య పై వ్యాక్యానించాలి అంటే దాని పై నాకు పూర్తిస్థాయి జ్ఞానం కలిగి ఉంటె తప్పే నేను మాట్లాడాను. ఐతే నా ప్రాధాన్యత ఎప్పుడు మన దేశానికే,” అని అన్నాడు కోహ్లీ.

ప్రస్తుతం బెంగుళూరు లో ఉన్న విరాట్ కోహ్లీ, ఈ వారం ప్రారంభంకానున్న ఐపీఎల్ సీజన్ కోసం సన్నద్ధం అవుతున్నాడు. అతను ఈ సారి ఎలాగైనా ఐపీఎల్ సాధించాలని దృఢనిశ్చయంతో ఉన్నట్టు చెప్పాడు.

SHARE