Shikhar Dhawan of India celebrates his Hundred runs during the 3rd One Day International between India and Sri Lanka held at the The ACA-VDCA Stadium, Visakhapatnam on the 17 December 2017 Photo by Deepak Malik / BCCI / Sportzpics

భారత్ క్రికెట్ లో పలు దశాబ్దాల నుండి ఎందరో మంచి బ్యాట్స్ మాన్ వచ్చారు. అందులో చాలా మంది తమ పేర్లను క్రికెట్ చరిత్రలో లిఖించారు.

సునీల్ గవాస్కర్ మొదలు పెట్టిన రికార్డుల పర్వం, తర్వాత సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ ఇంకా చాలా మంది ఎన్నో రికార్డులను సృష్టించారు. వీరేంద్ర సెహ్వాగ్ లాంటి అరుదైన ఆటగాడి స్థానం లో చోటు సాధించిన శిఖర్ ధావన్, తన ఫామ్ ను చాలా సార్లు కనబర్చాడు.

2013 ఛాంపియన్స్ ట్రోఫీ లో ఒంటి చేత్తో భారత్ బాటింగ్ అతను మోసి, అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవలే తన కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్ చూపుతున్న ధావన్, వైజాగ్ లో జరిగిన మూడో వన్ డే లో మరో సారి అజేయమైన సెంచరీ సాధించి భారత్ సిరీస్ గెలవడం లో కీలక పాత్ర పోషించాడు.

ఐతే ఆ సెంచరీ సాధించే ప్రక్రియలో అతను వన్ డే క్రికెట్ లో 4000 పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు. భారత్ వన్ డే క్రికెట్ చరిత్రలో 4000 పరుగులు అత్యంత వేగం గా పూర్తి చేసిన ఎడమ చేతి బాట్స్మన్ గా ఆయన సౌరవ్ గంగూలీ రికార్డును బద్దలు కొట్టాడు.

అయితే మొత్తానికి ఈ రికార్డు సాధించిన వారి జాబితాలో రెండో స్థానం సాధించాగా, మొదటి స్థానం లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. 4000 పరుగుల మైలురాయి ని శిఖర్ ధావన్ తన 95 వ ఇన్నింగ్స్ లో సాధించగా, విరాట్ కోహ్లీ 93 ఇన్నింగ్స్ లో సాధించడం గమనార్హం.

2010 లో ఇదే స్టేడియం తన తొలి మ్యాచ్ ఆడిన శిఖర్ ధావన్, అదే వైజాగ్ లో కెరీర్ లో 12 వ సెంచరీ సాధించి మాన్ అఫ్ ది సిరీస్ అవార్డు పొందాడు. ఇప్పటి వరకు 96 వన్ డేలు ఆడిన ధావన్, 44.86 సగటుతో 4038 పరుగులు పూర్తి చేసాడు. తన 12 సెంచరీలతో పాటు 23 అర్థ శతకాలు కూడా సాధించాడు.

వేగంగా 4000 పరుగులు సాధించిన జాబితాలో సౌరవ్ గంగూలీ మూడో స్థానం లో ఉండగా, 109 ఇన్నింగ్స్ లో ఈ మైలురాయి దాటినా నవజోత్ సింగ్ సిద్దు నాలుగో స్థానం దక్కించుకున్నాడు.

SHARE