Rohit Sharma Captain of India celebrates his Two Hundred runs during the 2nd One Day International between India and Sri Lanka held at the The Punjab Cricket Association IS Bindra Stadium, Mohali on the 13 December 2017 Photo by Deepak Malik / BCCI / Sportzpics

శ్రీలంక పై జరిగిన మూడో టీ20 ను భారత్ గెలవడంతో ఎంతో విజయపూరితమైన 2017 సంవత్సరం సంపూర్ణం అయింది.

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్ట్ ఇండీస్, శ్రీలంక వంటి అగ్ర క్రికెట్ జట్లను అలవోకగా ఒడినించిన కోహ్లీ సేన, వచ్చే ఏడాది నుంచి క్లిష్టమైన ఓవర్సీస్ పిచ్ లపై తమ ప్రతిభ చాటేందుకు సన్నద్ధం అవుతుంది.

అయితే భారత్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ తనకంటూ ఒక పేరు అప్పుడే తెచ్చుకోగా, రోహిత్ శర్మ ఏ మాత్రం తక్కువ కాదు అని ఈ ఏడాది నిరూపించుకున్నాడు. తాజా గా జరిగిన శ్రీలంక సిరీస్ లో మొత్తం మూడు ఫార్మాట్లలో తన సత్తా చాటాడు.

తొలుత జరిగిన టెస్ట్ సిరీస్ లో మూడు ఏళ్ళ తర్వాత సెంచరీ సాధించగా, వన్ డే మరియు టీ 20 సిరీస్ లలో తన విశ్వ స్వరూపం చూపించాడు. మొహాలీ లో జరిగిన రెండో వన్ డే లో తన కెరీర్ లో మూడో డబుల్ సెంచరీ సాధించగా, ఇండోర్ లో జరిగిన రెండో టీ 20 లో మరో సెంచరీ సాధించి అందరిని అబ్బురపరిచారు.

అయితే ఇన్ని పరుగులు సాధించిన రోహిత్ శర్మ, తనదైన స్టైల్ లో సిక్సులు బాదుతూ చేసాడు. రెండో టీ 20 చేసిన అద్భుత సెంచరీ తో ఒకే సంవత్సరం లో అత్యధిక సిక్సులు కొట్టిన బాట్స్మన్ గా రికార్డు సృష్టించిన రోహిత్, ఆఖరి టీ20 లో మరో సిక్స్ తన ఖాతా లో వేసుకున్నాడు.

2017 లో మొత్తం 65 సిక్సులు కొట్టిన రోహిత్ శర్మ, ఇప్పటి వరకు ఉన్న ఏబి డివిల్లీర్స్ 63 సిక్సులు రికార్డును బద్దలు కొట్టాడు. దీనితో క్రికెట్ఒ చరిత్రలో కే ఏడాది లో అత్యధిక సిక్సులు కొట్టిన బాట్స్మన్ గా రికార్డుల పుస్తకాల్లో చోటు సాధించాడు.

అయితే 2017 కేవలం శ్రీలంక పై రోహిత్ శర్మ 38 సిక్సులు సాధించడం విశేషం. దీనితో అతను క్రిస్ గేల్ పేరు మీద ఉన్న 33 సిక్సులు రికార్డు బద్దులు కొట్టాడు. 2012 లో న్యూజిలాండ్ పై క్రిస్ గేల్ ఈ రికార్డు ను సాధించాడు.

SHARE