భారత్ సౌత్ ఆఫ్రికా సిరీస్ హోరాహోరీ గా జరుగుతున్న విషయం తెలిసిన విషయమే. తొలి రెండు టెస్టుల్లో సౌత్ ఆఫ్రికా తమ ఆధిపత్యం చూపించగా, విరాట్ కోహ్లీ సేన మూడో టెస్టు నుంచి తమ సత్తా చాటారు.
అయితే ఇప్పటికే తొలి రెండు వన్ డే లు ఓడిపోయినా సౌత్ ఆఫ్రికాకు మరో దెబ్బ తగిలింది. ఓపెనర్ బాట్స్మెన్ మరియు వికెట్ కీపర్ అయినా క్విన్ టన్ డి కోక్, మణి కట్టు గాయంతో మిగిలిన నాలుగు వన్ డేలకు మరియు టీ 20 సిరీస్ కు దూరం అయ్యాడు.

Photo by Ron Gaunt / BCCI / SPORTZPICS
టెస్టు సిరీస్ నుంచి గాయంతో బాధపడుతున్న డి కోక్, రెండో వన్ డే లో కీపింగ్ చేస్తూ కష్టంగా కనిపించాడు. కానీ ఇప్పటికే కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ను మొత్తం సిరీస్ కు, ఏ బి డివిల్లీర్స్ ను తొలి మూడు వన్ డేలకు దూరం చేసుకున్న సౌత్ ఆఫ్రికా, సిరీస్ నిలిపుకే ఆశలకు పెద్ద గండే పడింది.
రెండో వన్ డే లో కేవలం 118 పరుగులకే అల్ అవుట్ అయినా సౌత్ ఆఫ్రికా, తమ బాటింగ్ లైన్ అప్ లో ముఖ్యమైన ఆటగాళ్లలో ఒకడైన డి కోక్ ను కోల్పోవడంతో మూడో వన్ డేలో ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి.

ఐతే డు ప్లెసిస్ గాయం తరువాత స్క్వాడ్ లోకి వచ్చిన హెన్రిక్ క్లాసేన్, తన వన్ డే అరంగ్రేటం వచ్చే వన్ డే చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారత్ తో జరిగిన టెస్టు సిరీస్ మరియు వన్ డే సిరీస్ లో ఎటువంటి ఫామ్ చూపలేకపోయిన డి కోక్, ఈ విశ్రాంతి తరువాత మరింత ఫామ్ సాధించాలని అసిధాం.
డి కోక్ లేని జట్టులో ప్రస్తుతం జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న మార్క్రామ్ హషిమ్ ఆమ్లా తో కలిసి మూడో వన్ డే లో ఓపెనింగ్ చేయొచ్చు అనే వార్తలు గట్టిగ వినిపిస్తున్నాయి.