MUMBAI, INDIA - JUNE 22, 2008: Indian cricket team's captain Mahendra Singh Dhoni and coach Gary Kirsten leave after a news conference in Mumbai June 22, 2008. The Indian cricket team leaves tonight to play sixnation Asia Cup tournament in Pakistan, which begins June 24. Teams playing in the Asia Cup are Pakistan, India, Sri Lanka, Bangladesh, Hong Kong and United Arab. (Photo by Satish Bate/Hindustan Times via Getty Images)

ప్రస్తుత భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఎం ఎస్ ధోని కంటే చాలా భిన్నమైన కెప్టెన్సీ స్టైల్ కలిగి ఉన్నాడు అని మాజీ భారత్ కోచ్ గ్యారీ కిర్ స్టెన్ అభిప్రాయపడ్డాడు.

ఎం ఎస్ ధోని నాయకత్వం మరియు గ్యారీ కిర్ స్టెన్ భారత్ టీం కు కోచ్ గా వ్యహరిస్తున్న సమయం లోనే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ అరంగ్రేటం చేసాడు. అయితే కిర్ స్టెన్ తన భారత్ కోచ్ గా ఉన్నపుడు, విరాట్ చక్కటి ప్రదర్శనలతో తనకంటూ ఒక పేరు సాధించుకున్నాడు.

ఈ ఏడాది ఐపిఎల్ లో మరో సారి ఈ ద్వయం తమ మ్యాజిక్ ను ప్రదర్శించనున్నారు. రాయల్ ఛాలెంజెర్స్ బెంగుళూరు జట్టుకు కిర్ స్టెన్ ను కోచ్ గా ప్రకటించగా, విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

ఈ నెల 27 మరియు 28 న జరగనున్న ఐపిఎల్ ఆక్షన్ లో రాయల్ ఛాలెంజెర్స్ జట్టును ఎన్నుకునే విషయంలో గ్యారీ బిజీగా ఉండనున్నాడు. అయితే విరాట్ కోహ్లీ, తన జట్టు తో సౌత్ ఆఫ్రికాలో మూడో టెస్ట్ ఆడబోతున్నాడు.

2010 -11 లో భారత్ జట్టు ను సౌత్ ఆఫ్రికా సిరీస్ లో ముందంజ లో నిలిపిన గ్యారీ కిర్ స్టెన్, ప్రస్తుత జట్టు లో మరిన్ని స్పెషలిస్ట్ బాట్స్మన్ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆయితే అదే విధంగా జట్టులో 20 వికెట్లు తీయగలిగే బౌలర్లు లు కూడా ఉండటం చాలా అవసరం అని చెప్పారు.

ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ ను సౌత్ ఆఫ్రికా 2 -0 తో చేగికించుకున్న విషయం తెలిసిందే, అయితే బౌలర్లు తమ స్థాయికి తగినట్టు రాణించినప్పటికీ, బాట్స్మెన్ మాత్రం నిరాశ పరిచారు.

2008 నుండి 2011 వరకు భారత్ కోచ్ గా పనిచేసిన గ్యారీ కిర్ స్టెన్, స్వదేశం లో జరిగిన ప్రపంచ కప్ ను భారత్ కు అందించారు. అలానే అతను కోచ్ గా ఉన్న సమయం లో భారత్ టెస్టుల్లో కూడా నెం. 1 స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఐపిఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు పనిచేసిన గురు గ్యారీ కి అంత విజయాలు రానప్పటికీ, రాయల్ ఛాలెంజెర్స్ జట్టు ను వారి తొలి ఐపిఎల్ ట్రోఫీ దిశగా తీసుకెళ్ల గలడా అనేది చూడాల్సిన విషయం.

SHARE