Sunrisers Hyderabad captian David Warner hit the six during the final of the Vivo IPL 2016 ( Indian Premier League ) between The Royal Challengers Bangalore and the Sunrisers Hyderabad held at The M. Chinnaswamy Stadium in Bangalore, India, on the 29th May 2016 Photo by Deepak Malik / IPL/ SPORTZPICS

‌బాల్ ట్యాంపరింగ్ వివాదంలో పన్నెండు నెలలు వేటుకు గురైన మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్, తనపై విధించిన ఆంక్షలపై తిరిగి ఏపిల్ చేసుకోనని తన సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేశాడు.

దక్షిణాఫ్రికా పై జరిగిన మూడో టెస్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ మరియు కామెరాన్ బ్యాంకు రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్ వివాదంలో నిందితులుగా తేలారు. ఈ బాల్ టాంపరింగ్ వివాదం ప్రపంచ క్రికెట్ అభిమానులను బాగా కదల్చి వేయగా, ఆస్ట్రేలియాలో కూడా పెను సంచలనమే సృష్టించింది.

ఆస్ట్రేలియా ప్రధాని దగ్గర నుండి సామాన్య క్రికెట్ అభిమాని వరకూ అందరూ తమ యొక్క నిసంతృప్తిని వ్యక్తం చేశారు. నిన్ననే స్టీవ్ స్మిత్ మరియు కామెరూన్ బాంక్రాఫ్ట్ తమపై విధించిన వేటుపై ఎటువంటి చేయమని సోషల్ మీడియా ద్వారా తెలుపగా, ఈ రోజు తన ట్విటర్ అకౌంట్ ద్వారా డేవిడ్ వార్నర్ కూడా అదే నిర్ణయం తీసుకున్నట్టు అభిమానులకు తెలిపాడు.

“నాపై క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన ఆంక్షలను నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను”, అని ట్వీట్ చేశాడు.

“నేను చేసిన చర్యలకు నేను నిజంగా విచారిస్తున్నాను. ఇక ముందు నేను వ్యక్తిగా, సహచరుడిగా, రోల్ మోడల్గా ఉండడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాను,” అని అన్నాడు.

అయితే ఇప్పుడు వార్నర్ పై ఉన్నవేటు వలన అతను వచ్చే పన్నెండు నెలలు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులోఆడటం కుదరదు. అలానే అతనిపై విధించిన ఆంక్షల ప్రకారం అతను భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ కూడా కాలేడు.

ఈ వేటు వలన అతనుఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఆడటం కూడా జరగదు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే కేన్ విలియమ్సన్ ను కెప్టెన్గా ప్రకటించారు. భారత్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను జట్టుకు వైస్ కెప్టెన్ గా నియమించారు. గత మూడు సీజన్ లలో రెండు సార్లు ఆరంజ్ కాప్ గెలుచుకున్న వార్నర్ లేకపోవడం చాలా పెద్ద నష్టమైనప్పటికీ, సన్ రైజర్స్ జట్టు చాలా గట్టిగా ఉండటం విశేషం.

SHARE