DELHI, INDIA - MARCH 26: A general view of the trophy on display ahead of the ICC World Twenty20 India 2016 Super 10s Group 1 match between England and Sri Lanka at The Feroz Shah Kotla Cricket Ground on March 26, 2016 in Delhi, India. (Photo by Jan Kruger-IDI/IDI via Getty Images)

2020 లో జరిగే టీ 20 ప్రపంచ కప్ కు ఆస్ట్రేలియా ఆతిధ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్నీ ఐసిసి అధికారికంగా ప్రకటించింది. వచ్చే ప్రపంచ కప్ ఎడొవ ఎడిషన్ కానుండగా, ఆస్ట్రేలియా లో జరగబోతున్న తొలి పొట్టి ప్రపంచ కప్ పోటీ.

2007 లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన టీ 20 ప్రపంచ కప్ ప్రజల్లో మంచి ఆధారణ సాధించింది. తొలి ఎడిషన్ లో దాయాది జట్టు పాకిస్తాన్ ను ఓడించి భారత్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

ఐతే 2009 లో ఇంగ్లాండ్ లో జరిగిన రెండో ప్రపంచ కప్ లో పాకిస్తాన్ శ్రీలంక ను ఓడించినా తమ మొదటి ప్రపంచ కప్ గెలుచుకుంది. 2010 లో వెస్ట్ ఇండీస్ లో జరిగిన మూడో టోర్నమెంట్ లో ఇంగ్లాండ్ తమ తొలి ఐసిసి ట్రోఫీ గెలుచుకోగా, 2012 శ్రీలంక లో జరిగిన నాలుగో ప్రపంచ కప్ ను విండీస్ కైవసం చేసుకుంది.

2014 లో బాంగ్లాదేశ్ లో జరిగిన ప్రపంచ కప్ లో భారత్ ను ఓడించి శ్రీలంక తొలి టీ 20 ప్రపంచ కప్ సాధించగా, ఇటీవలే 2016 లో జరిగిన ఆరో టోర్నమెంట్ ను వెస్ట్ ఇండీస్ గెలిచింది. తద్వారా టీ 20 ప్రపంచ కప్ ను రెండు సార్లు గెలిచినా ఏకైక జట్టు గా రికార్డు సృష్టించింది.

ఐతే తదుపరి ఎడిషన్ 2018 లో నిర్వహించేందుకు ఐసిసి ఆలోచించగా, 2017 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత ఆ ఆలోచనను విరమించుకొన్నారు. 2020 లో ఏడో ఎడిషన్ నిర్వహించేందుకు ఐసిసి సనాదమై ఆస్ట్రేలియాను ఆతిధ్య దేశంగా నిర్ణయించారు.

ఆస్ట్రేలియా ఇప్పటి వరకు న్యూజిలాండ్ తో కలిసి రెండు 50 ఓవర్ ప్రపంచ కప్ లకు ఆతిధ్యం ఇవ్వగా, ఇదే వారి తొలి టీ 20 టోర్నమెంట్ కావడం విశేషం. 2020 జరగబోయే ప్రపంచ కప్ కు ఈ మంగళవారం ఐసిసి ఆతిధ్యం ఇవ్వనున్న స్టేడియంల జాబితా విడుదల చేయనున్నారు.

ఇటీవలే 2018 లో జరగున్న మహిళా టీ 20 ప్రపంచ కప్ కు వేదిక కానున్న స్టేడియంల జాబితా విడుదల చేసిన ఐసిసి, తొలి సారి కేవలం మహిళల టీ 20 ప్రపంచ కప్ ను నిర్వహించడం విశేషం. ఇన్నాళ్లు పురుషుల మరియు మహిళల టీ 20 ప్రపంచ కప్ లు ఒకే సారి జరిగేవి.

SHARE