క్రికెట్ చరిత్రనే మార్చేసిన ఒకే ఒక్క దేశవాళీ టోర్నమెంట్ ఐపీఎల్. 2008 లో ప్రారంభమైన ఈ ధనిక లీగ్, ఆటగాళ్లకు ఆర్థిక భద్రతను కలిపించింది. భారత్ ఉపఖండంలో కూడా క్రికెట్ కు సరికొత్త క్రేజ్ తీసుకొచ్చి పెట్టింది ఐపీఎల్.
ఐపీఎల్ 11 వ ఎడిషన్ ప్రారంభం కాన్నుండటంతో ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో అత్యధిక సిక్సులు కొట్టిన టాప్ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#5. విరాట్ కోహ్లీ – 159 సిక్సులు
2008 నుండి రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కు ఆడుతున్న విరాట్ కోహ్లీ, ప్రతి ఏడాది మరింత మంచి బాట్స్మన్ గా మారుతూ వెళ్ళాడు. తొలుత క్లాసిక్ బాట్స్మన్ గా అందరు కోహ్లీ ను భావించగా, అతను తన స్కోర్ పెంచుకునేందుకు విధానాలు కనుగొన్నాడు.
వేరే ఆటగాళ్లలా రిస్కుతో కూడిన షాట్లు కాకుండా, సాధారణ క్రికెట్ షాట్లతోనే సిక్సులు కొట్టడం మొదలు పెట్టాడు. అతను ఇప్పటి వరకు 149 మ్యాచ్లలో 159 సిక్సులు సాధించాడు.
#4. డేవిడ్ వార్నర్- 160 సిక్సులు

Photo by Deepak Malik / IPL/ SPORTZPICS
ఆది నుండి మంచి హార్డ్ హిట్టర్ గా పేరు తెచ్చుకున్న డేవిడ్ వార్నర్, ఢిల్లీ డేర్ డెవిల్స్ లో ఉండగా వీరేందర్ సెహ్వాగ్ తో కలిసి సంచలన ఇన్నింగ్స్ ఆడేవాడు. ఇరువురు కలిసి ప్రత్యర్థి బౌలర్లను బాదేవారు. ఐతే సన్ రైజర్స్ హైదరాబాద్ కే వచిన తరువాత అతని ఆటలో నిలకడ ప్రారంభమైంది.
ఐపీల్ లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడైన వార్నర్, తన ఐపీఎల్ కెరీర్ లో ఇప్పటి వరకు 160 సిక్సులు కొట్టాడు.
#3. రోహిత్ శర్మ – 172 సిక్సులు
భారత్ క్రికెట్ జట్టులో సిక్సులను అలవోకగా కొట్టే సత్తా ఉన్న బాట్స్మెన్ రోహిత్ శర్మ. తొలుత డెక్కన్ ఛార్జర్స్ కు ఆడిన సమయంలో అతను మిడిల్ ఆర్డర్ లో బాటింగ్ కు వచ్చే వాడు.
ఐతే ముంబై ఇండియన్స్ లో ఆడటం మొదలుపెట్టిన తరువాత అతను ఓపెనింగ్ లేదా మూడో స్థానంలో బాటింగ్ చేస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్లలో ఒకడైన రోహిత్ శర్మ, ఇప్పటి వరకు 172 సిక్సులు బాదాడు.
#2. సురేష్ రైనా- 173 సిక్సులు
ఐపీఎల్ లోనే అత్యంత స్థిరమైన రికార్డు కలిగిన ఏకైక బాట్స్మన్ సురేష్ రైనా. అతను ప్రతి ఏడాది కనీసం 400 పరుగులు చేస్తాడని అభిమానులు మరియు టీం యాజమాన్యం నమ్ముతాయి.
అతను కూడా అలానే పది సంవత్సరాల పాటు ఒకే విధంగా ప్రదర్శనలు చేస్తూ ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో తన కెరీర్ ప్రారంభించిన రైనా, ఆ జట్టు వేటుకు గురైన తరువాత గుజరాత్ లయన్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటి వరకు రైనా 173 సిక్సులు సాధించి రెండో స్థానంలో ఉన్నాడు.
#1. క్రిస్ గేల్ – 265 సిక్సులు
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విద్వంసరకర్ బాట్స్మన్ క్రిస్ గేల్. అతను తన బాటింగ్ తో ఎన్నో మ్యాచులు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కు తెచ్చిపెట్టాడు.
మొదట్లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడిన గేల్, తరువాత ఆక్షన్ అమ్ముడుపోలేదు. ఐతే బెంగుళూరు ఫ్రాంచైజ్ అతని గాయం కలిగిన ఆటగాడి స్థానంలో తీసుకుంది. తరువాత అతను ఐపీఎల్ లో సరికొత్త అధ్యాయం లిఖించాడు. ఇప్పటి వరకు కేవలం 101 మ్యాచులు ఆడిన గేల్, 265 సిక్సులు సాధించడం విశేషం.