క్రికెట్ చరిత్రనే మార్చేసిన ఒకే ఒక్క దేశవాళీ టోర్నమెంట్ ఐపీఎల్. 2008 లో ప్రారంభమైన ఈ ధనిక లీగ్, ఆటగాళ్లకు ఆర్థిక భద్రతను కలిపించింది. భారత్ ఉపఖండంలో కూడా క్రికెట్ కు సరికొత్త క్రేజ్ తీసుకొచ్చి పెట్టింది ఐపీఎల్.

ఐపీఎల్ 11 వ ఎడిషన్ ప్రారంభం కాన్నుండటంతో ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన టాప్ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#5. సురేష్ రైనా- 32 అర్ధ సెంచరీలు

ఐపీఎల్ లోనే అత్యంత స్థిరమైన రికార్డు కలిగిన ఏకైక బాట్స్మన్ సురేష్ రైనా. అతను ప్రతి ఏడాది కనీసం 400 పరుగులు చేస్తాడని అభిమానులు మరియు టీం యాజమాన్యం నమ్ముతాయి.

అతను కూడా అలానే పది సంవత్సరాల పాటు ఒకే విధంగా ప్రదర్శనలు చేస్తూ ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో తన కెరీర్ ప్రారంభించిన రైనా, ఆ జట్టు వేటుకు గురైన తరువాత గుజరాత్ లయన్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఐతే ఈ ఏడాది మరల చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడనున్న రైనా, ఐపీఎల్ లో 161 మ్యాచ్ లలో ఇప్పటి వరకు 32 అర్ధ సెంచరీలు సాధించాడు.

#4. రోహిత్ శర్మ- 33 అర్ధ సెంచరీలు

డెక్కన్ ఛార్జర్స్ తో తన కెరీర్ ను ప్రారంభించిన రోహిత్, వారి ఐపీఎల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐతే తరువాత ముంబై ఇండియన్స్ కు ఆడటం మొదలు పెట్టిన రోహిత్, తన కెరీర్లో మొత్తం నాలుగు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచాడు.

ఇటీవలే కాలంలో ముంబై ఇండియన్స్ కు వెన్నెముకగా నిలిచినా రోహిత్ శర్మ, చాలా నిలకడగా పరుగులు చేస్తున్నాడు. అతను ఇప్పటి వరకు 33 అర్ధ సెంచరీలు కొట్టి నాలుగో స్థానం లో ఉన్నాడు.

#3. విరాట్ కోహ్లీ – 34 అర్ధ సెంచరీలు 

 

ఐపీఎల్ చరిత్రలో ఒకేఒక్క ఫ్రాంచైజ్ కు ఆడుతున్న ఆఖరి ఆటగాడు విరాట్ కోహ్లీ. 2008 నుండి రాయల్ చాలెంజర్స్ కు ఆడుతున్న విరాట్, ఐపీఎల్ తోనే టీ 20 ల్లో కూడా ప్రపంచ స్థాయి బాట్స్మెన్ అయ్యాడు.

ఐతే ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా గెలుచుకొని విరాట్ కోహ్లీ, 149 మ్యాచ్ లలో 34 అర్ధ సెంచరీలు చేసాడు.

#2. గౌతమ్ గంభీర్- 35 అర్ధ సెంచరీలు

2008 లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో తన ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన గౌతమ్ గంభీర్, తరువాత కోల్ కతా నైట్ రైడర్స్ చరిత్రలో తనదైన ముద్ర వేసాడు. వారికి ఏడు ఏళ్ళు కెప్టెన్ గా వ్యవహరించిన గంభీర్, రెండు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచాడు.

తన ఐపీఎల్ కెరీర్ లో 148 ఐపీఎల్ మ్యాచులు ఆడిన గంభీర్, 35 అర్ధ సెంచరీలు కొట్టి రెండో స్థానం లో ఉన్నాడు.

#1. డేవిడ్ వార్నర్ – 39 అర్ధ సెంచరీలు

Sunrisers Hyderabad captian David Warner hit the six during the final of the Vivo IPL 2016 ( Indian Premier League ) between The Royal Challengers Bangalore and the Sunrisers Hyderabad held at The M. Chinnaswamy Stadium in Bangalore, India, on the 29th May 2016
Photo by Deepak Malik / IPL/ SPORTZPICS

ఐపీఎల్ లో రెండో సీజన్ లో తన కెరీర్ ను ప్రారంభించిన డేవిడ్ వార్నర్, వీరేందర్ సెహ్వాగ్ తో సంచలన ఓపెనింగ్ పార్టీనేర్షిప్ కు తెర తీసాడు. తరువాత సన్ రైజర్స్ హైదరాబాద్ లో చేరిన వార్నర్, శిఖర్ ధావన్ తో కూడా అంతే రీతిలో పరుగులు చేస్తూ, ఐపీఎల్ చరిత్రలో గొప్ప బాట్స్మెన్ లో ఒకడయ్యాడు.

2016 లో సన్ రైజర్స్ ను ఐపీఎల్ విజేతలు గా నిలిపిన వార్నర్, గత రెండు సీజన్ లలో రెండు సార్లు ఆరంజ్ కాప్ గెలుచుకున్నాడు. తన కెరీర్లో 114 మ్యాచ్ లు ఆడిన వార్నర్, 39 అర్ధ శతకాలు సాధించి అగ్ర స్థానంలో ఉన్నాడు.

SHARE