Deepak Hooda of Sunrisers Hyderabad plays a delivery behind towards the boundary during match 42 of the Vivo IPL 2016 (Indian Premier League) between the Sunrisers Hyderabad and the Delhi Daredevils held at the Rajiv Gandhi Intl. Cricket Stadium, Hyderabad on the 12th May 2016 Photo by Shaun Roy / IPL/ SPORTZPICS

రెండు సంవత్సరాలు ఐపిఎల్ నుండి వేటుకు గురైన రాజస్థాన్ రాయల్స్ జట్టు తిరిగి 2018 లో పునఃప్రవేశం చేస్తుంది. అయితే వారి సీజన్ ప్రారంభం కాకముందే వారి కెప్టెన్ అయిన స్టీవ్ స్మిత్  కోల్పోవడం వారికి పెద్ద తప్పే అని చెప్పవచ్చు.

సోమవారం ఉప్పల్లో వారి తొలి ఐపీఎల్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తో ఆడనున్నారు. వారిలానే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా డేవిడ్ వార్నర్ ను కోల్పోయింది. అయితే జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉండటంతో హైదరాబాద్ కు ఇప్పుడు కూడా మంచి సమతుల్యం కలిగి ఉంది.

పిచ్ రిపోర్ట్

గత రెండు రోజులుగా హైదరాబాద్లో వర్షాలు విస్తారంగా పడటంతో పిచ్ బౌలింగ్కు ఎక్కువగా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా బ్యాట్స్మెన్కు అనుకూలించే ఉప్పల్ పిచ్ గత రెండు రోజులుగా కవర్స్ కింద ఉండటంతో పిచ్ పై తేమ శాతం ఎక్కువ ఉంటుంది.

క్యూరేటర్లు పిచ్ను వీలైనంత పొడి చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ తొలి ఇన్నింగ్స్ లో పేస్ బౌలర్లకు మంచి సహకారం అందుతుంది.

టాస్ గెలిస్తే?

రాజస్థాన్ రాయల్స్ జట్టుతో పోలిస్తే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పేస్ బౌలింగ్ లో మంచి పదును కలిగి యున్నది. వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో టాస్ గెలిచిన కెప్టెన్, కచ్చితంగా ఫీల్డింగ్ నే ఎంచుకుంటారు.

కేవలం పిచ్ మాత్రమే కాకుండా వాతావరణంలో కూడా అనిశ్చితి ఏర్పాటు కావడంతో, ఈ ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో చేజింగ్ చేయడమే మంచి నిర్ణయం.

హెడ్ టు హెడ్ రికార్డు

ఈ ఇరు జట్లు ఇప్పటి వరకు ఏడు సార్లు తలపడగా, రాజస్థాన్ రాయల్స్ నాలుగు విజయాలతో ముందుండగా సన్ రైజర్స్ హైదరాబాద్ మూడు విజయాలు సాధించింది.

అయితే 2015 లో రాజస్థాన్ రాయల్ వేటుకు గురి అయిన తరువాత సన్ రైజర్స్ హైదరాబాద్ గత రెండు సీజన్లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనే అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలిచింది. ఉప్పల్ స్టేడియం ను తమ కంచుకోటగా మార్చుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించడం అంత తేలిక కాదు.

ప్లేయర్ల ఫామ్

ఇరు జట్లలో చాలామంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్న బెన్ స్టోక్స్ ఇటీవలే జరిగిన న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్లో చక్కగా రాణించాడు. అలానే వారి విదేశీ ఆటగాళ్లు డార్సీ షార్ట్,  ఆర్చర్ గత డిసెంబర్లో జరిగిన బీబిఎల్ లీగ్లో సంచలనమే సృష్టించారు.

భారత క్రికెటర్ అజింక్యా రహానే ఫర్వాలేదనిపించగా, పేస్ బౌలర్ జయదేవ్ ఉనాద్కట్ మాత్రం కాస్త నిరాశ పరిచాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇంగ్లాండ్ పై చక్కగా రాణించాడు. అలానే భారత క్రికెటర్లు భువనేశ్వర్ కుమార్ మనీష్ పాండే శిఖర్ దావన్ చాలా మంచి ఫాంలో ఉన్నారు. ఆఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మరోసారి తన మాయాజాలం ప్రేక్షకులకు చూపించడం ఖాయంగానే కనిపిస్తుంది.

మ్యాచ్ అంచనా: సన్రైజర్స్ జట్టు వార్నర్ ను కోల్పోయినప్పటికీ వారిని సొంత గడ్డపై ఓడించడం రాజస్థాన్ రాయల్స్కు కష్టమైన పని. అందులోనూ సన్ రైజర్స్ ఆటగాళ్లు అంతా మంచి ఫామ్తో కొత్త ఐపీఎల్ సీజన్ లో అడుగుపెట్టడంతో వారిపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ మ్యాచ్ను సన్రైజర్స్ జట్టు అలవోకగా గెలుస్తుందని మా అంచనా

SHARE