భారత్ తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్ ను గెలిచి నిదాహస్ ట్రోఫీ లో ముందంజ వేసింది ఆతిధ్య జట్టు శ్రీలంక. శ్రీలంక కు స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ళు సందర్భంగా ఆడుతున్న ఈ ముక్కోణపు సిరీస్ లో భారత్, శ్రీలంక తో పాటు బాంగ్లాదేశ్ కూడా ఉంది.

అయితే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దినేష్ చండీమల్ నిర్ణయాన్ని సరైనదే అని నిరూపిస్తూ బౌలర్లు రెండు వికెట్లు తొలి రెండు ఓవర్లలో తీశారు. కానీ శిఖర్ ధావన్ తన అనుభవం తో మనీష్ పాండే సహకారంతో చక్కటి పార్టీనేర్షిప్ నెల్కొలిపాడు.

నిర్ణిత 20 ఓవర్లలో 174 పరుగులు చేసిన భారత్ జట్టులో శిఖర్ ధావన్ మినహా ఇంకెవరు ఆకట్టుకోలేకపోయారు. పెద్ద టార్గెట్ ను ఛేదించడానికి వచ్చిన శ్రీలంక తొలి వికెట్ రెండో ఓవర్లోనే కోల్పోయింది.

కానీ కుశాల్ పెరీరా అత్యద్భుత ఇన్నింగ్స్ ఆడి ఆతిధ్య జట్టుకు తమ విజయాన్ని అందించాడు. కేవలం 37 బంతుల్లో 66 పరుగులు చేసిన పెరీరాను మాన్ అఫ్ ది మ్యాచ్ గా ఎంపిక చేసారు.

Colombo : Sri Lanka’s Kusal Perera celebrates scoring a half century against India during their Twenty20 cricket match in Nidahas Triangular series in Colombo, Sri Lanka, Tuesday, March 6, 2018. AP/ PTI(AP3_6_2018_000192B)

తమ విజయం తరువాత మాట్లాడుతూ శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమల్: “ఈ విజయం మా జట్టును మంచి ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి టోర్నమెంట్ ఈ రీతిలో మొదలు పెట్టడం చాలా ముఖ్యం. మేము ఆడిన ఆఖరి సిరీస్ చాలా కాంఫిడెన్స్ ఇచ్చింది. అయితే బ్యాక్ రూమ్ స్టాఫ్ చాలా కష్టపడ్డారు.

ప్రాక్టీస్ సెషన్స్ వారు అందించిన సహకారం చాలా ఉపయోగపడింది. క్రెడిట్ మొత్తం టీం కే చెందుతుంది. మా కొత్త కోచ్ హతురుసింఘా మంచి పని చేస్తున్నారు. మేము ఎంత మంచి జట్టే మా అందరికి తెలుసు. ఈ విజయం చాలా ఆనందాన్ని ఇస్తుంది.”

SHARE