Indian cricket captain Mahendra Singh Dhoni (L) and teamate Virender Sehwag (R) walk back to the pavillion after victory in the third One Day International (ODI) cricket match of the Micromax tri-series between Sri Lanka and India at the Rangiri Dambulla International Cricket stadium in Dambulla, some 150 kms north of Colombo on August 16, 2010. India won by 6 wickets. AFP PHOTO/Lakruwan WANNIARACHCHI (Photo credit should read LAKRUWAN WANNIARACHCHI/AFP/Getty Images)

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మహేంద్ర సింగ్ ధోని భారత జట్టు చాలా ఆవరసం అని చెప్పారు. ధోని మరో సారి రెండో టీ 20 లో తన ఇన్నింగ్స్ ను మెల్లగా ఆడటం తో చాలా మంది విమర్శకులు మరో సారి ధోని పై విమర్శలు సందించారు.

భారత్ కు 12 కు పైగా రన్ రేట్ పై పరుగులు చేయాల్సిన సమయంలో వచ్చిన ధోని 10 బంతులు డాట్ ఆడటం వలన ఆయన పై మళ్ళీ ఒత్తిడి పెరుగుతుంది. ఇన్నింగ్స్ అయ్యే సమయానికి ధోని 37 బంతుల్లో 49 పరుగులు చేసిన, సరైన సమయం లో చేయకపోవడం వల్ల ఆయన పై విమర్శలు మళ్ళీ మొదలయ్యాయి.

భారత్ 67/4 ఉన్న పరిస్థితి లో 10 ఓవర్లో బాటింగ్ కు వచ్చిన ధోని, తొలుత 20 బంతుల్లో కేవలం 17 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. మాజీ క్రికెటర్లు లక్ష్మణ్, అజిత్ అగార్కర్ ధోని త్వరగా పరుగులు చేయాలి అని అభిప్రాయం సిరీస్ జరిగేటప్పుడే చెప్పారు లేకపోతే త్వరలోనే టీ 20 నుండి రిటైర్ అవ్వాలి అని సూచించారు.

అయితే సెహ్వాగ్ మాత్రం ధోని ను సమర్ధిస్తూ సరైన సమయం ధోని రిటైర్ అవుతాడు అని, అతని అవసరం భారత్ జట్టు కు టీ20ల్లో కూడా ఉందని చెప్పారు.

“భారత క్రికెట్ జట్టు కు ధోని అవసరం ఉంది, టీ 20 క్రికెట్ లో కూడా. ఆయన సరైన సమయం లో రిటైర్ అవుతాడు. ఎప్పుడు మరో యువ ఆటగాడు రానీయకుండా టీం లోనే ఉండిపోడు,” అని చెప్పారు .

అయితే భారత్ టీం మేనేజ్మెంటు ధోని కి తన బాటింగ్ బాధ్యతలు ఏంటో సరిగ్గా వివరించాలని అని చెప్పారు. ధోని కూడా తొలి బంతి నుండి పరుగులు రాబట్టాలి అని అన్నారు.

రెండవ టీ 20 తర్వాత వీ వీ ఎస్ లక్ష్మణ్ ధోని వన్ డే జట్టు కు చాలా అవసరం అని కానీ టీ 20 జట్టు లో మరో యువ క్రికెటర్ కు అవకాశం ఇస్తే బాగుంటుంది అని చెప్పారు.

మూడో టీ 20 లో అవకాశం రాని ధోని రిటైర్ అవతార లేక మరో సారి విమర్శకుల నోళ్లు మోయిస్తారా అన్నది చూడాల్సిన విషయం .

SHARE