Cricket - India v Sri Lanka- Third Test Match - Feroz Shah Kotla, New Delhi - December 5, 2017 - Sri Lanka players, wearing face masks, celebrate the dismissal of India's Ajinkya Rahane. REUTERS/Stringer

ప్రస్తుతం ఢిల్లీ లో జరుగుతున్న మూడో టెస్టులో శ్రీలంక ఆటగాళ్లు కాలుష్యం కారణం గా చాలా దెబ్బ తిన్నారు అని వారి టీం మానేజ్మెంటు చెప్పిన విషయం తెలిసిందే.

రెండో రోజు భారత్ చేసే సమయం లో చాలా సార్లు శ్రీలంక ఆటగాళ్లు చాలా నీరసం అయ్యారు అని వారు పదే పదే బ్రేక్ తీసుకున్నారు. అది చూసి విసిగిపోయిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసాడు.

విరాట్ కోహ్లీ డిక్లేర్ చేసిన వెంటనే శ్రీలంక ఆటగాళ్లు నవ్వుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లారు. మ్యాచ్ మొత్తం మాస్క్ ధరిస్తున్న శ్రీ లంక ఆటగాళ్లు ఎంత దారుణం గా తమ ఆరోగ్యం పోగొట్టుకున్నారో తెలీదు కానీ మెడికల్ టెస్టులు మాత్రం నిజాలను బయట పెట్టాయి.

కాలుష్యం తో బాధపడుతున్న ముగ్గురు శ్రీలంక ఆటగాళ్లు నిరాషన్ డిక్ వెల్ల, రోషన్ డే సిల్వా మరియు సందకాన్ మెడికల్ టెస్టుల్లో పాల్గొన్నారు. అయితే నాది మరియు ఆక్సిజన్ లెవెల్స్ పై జరిగిన ఈ పరిక్షాల్లో కొన్ని విషయాలు తెలిసాయి.

ఈ ముగ్గురు ఆటగాళ్ల ఆక్సిజన్ లెవెల్స్ 99, 98 , 99 అని తేలాయి. ఆక్సిజన్ లెవెల్స్ ఎవరికైనా 100 మాక్సిమం. అయితే ఈ విషయం తేలిన వెంటనే శ్రీలంక ఆటగాళ్లు మరిన్ని పరీక్షలు తీసుకునేందుకు నిరాకరించారు.

లంక ఫాస్ట్ బౌలర్ సురంగ లక్మల్ కూడా మెడికల్ టెస్టుల్లో పాల్గొనేందుకు నిరాకరించడం గమనార్హం. లక్మల్ ఢిల్లీ టెస్ట్ జరుగుతున్న సమయం లో చాలా సార్లు వాంతి చేసుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. క్రీడా స్ఫూర్తి కి విరుద్ధం గా ఆడుతున్న ప్రస్తుత శ్రీలంక జట్టు క్రికెట్ కు మచ్చ తీసుకువస్తుంది అనుకోవచ్చు.

SHARE