Britain Cricket - India v Bangladesh - ICC Champions Trophy Warm Up Match - The Oval - 30/5/17 India's Jasprit Bumrah (C) celebrates taking the wicket of Bangladesh's Mehedi Hasan Miraz (not pictured) Action Images via Reuters / Peter Cziborra Livepic EDITORIAL USE ONLY.

ఆతిధ్య శ్రీలంక పై తొలి టీ 20 ఓడిపోయిన తరువాత, భారత్ క్రికెట్ జట్టు బాంగ్లాదేశ్ పై చక్కటి విజయం సాధించింది. అయితే బాంగ్లాదేశ్ ఆతిధ్య జట్టు శ్రీలంక ను ఓడించడంతో ముక్కోణపు సిరీస్ రసవత్తరంగా మారింది.

శ్రీలంక తో తలపడనున్న భారత్, నాలుగో టీ 20 గెలిస్తే దాదాపు ఫైనల్స్ కు క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉంటాయి. రోహిత్ శర్మ సేన మరో సారి తొలి టీ 20 లో చేసిన తప్పులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించనున్నారు. అయితే చాలా మంది యువ క్రికెటర్లు ఉండటంతో తుది జట్టు ఎలా ఉండవచో ఇక్కడ చూద్దాం.

రోహిత్ శర్మ

ఇటీవలే మంచి ఫామ్ లో లేని రోహిత్ శర్మ, భారత్ కెప్టెన్ గా మరో సారి బరిలోకి దిగనున్నాడు. అయితే ఐపీఎల్ ముందు తాను మరో సారి మంచి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.

శిఖర్ ధావన్

ఫామ్ లో లేక రోహిత్ సతమతమవుతుంటే, శిఖర్ ధావన్ మాత్రం తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో 145 పరుగులు చేసాడు.

రిషబ్ పంత్

ఇటీవలే దేశావళి క్రికెట్లో మంచి ఫామ్ తో దూసుకుపోతున్న రిషబ్ పంత్ కు సెలెక్టర్లు తమ ఓటు వేశారు. కానీ శ్రీలంక పై ఆఖరి ఓవర్లలో తన దూకుడు చూపలేకపోయాడు ఈ యువ కిరణం. వచ్చే మ్యాచ్ లో తన సత్తా చాటి భారత్ జట్టులో స్థానం పదిలం చేసుకోవాలని చూస్తున్నాడు పంత్.

సురేష్ రైనా

టీం లోకి తిరిగి వచ్చినప్పటి నుంచి మంచి ఫామ్ చూపిస్తున్న సురేష్ రైనా, మరో సారి తన అల్ రౌండ్ ప్రతిభ చూపిస్తే భారత్ ఫైనల్స్ కు వెళ్లడం ఖాయం.

మనీష్ పాండే

నిలకడలేమి తో సతమతవుతున్న మనీష్ పాండే, తొలి టీ 20 లో శ్రీలంక పై 35 బంతుల్లో 37 పరుగులు చేసాడు. అయితే బాంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 19 బంతుల్లో 27 పరుగులు చేసి భారత్ ను విజయానికి తీసుకువెళ్లాడు.

దినేష్ కార్తీక్ 

India’s Dinesh Karthik celebrate scoring half a century against West Indies in his partnership with captain India’s captain Virat Kohli during the fifth ODI at the Sabina Park cricket ground in Kingston, Jamaica, Thursday, July 6, 2017. India won the match by 8 wickets and the series 3-1.(AP Photo/Ricardo Mazalan)

తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్న దినేష్ కార్తీక్, మరో సారి భారత్ స్లొగ్ హిట్టర్ గా ఎంపిక అవుతాడు. శ్రీలంక పై జరిగిన టీ 20 లో కేవలం 6 బంతుల్లో 13 పరుగులు చేసాడు.

వాషింగ్టన్ సుందర్

Indian cricketer Washington Sundar (R) celebrates with captain Rohit Sharma after he dismissed Sri Lankan cricketer Kusal Mendis during the opening Twenty20 international cricket match between Sri Lanka and India of the Nidahas Trophy tri-nation Twenty20 tournament at the R. Premadasa stadium in Colombo on March 6, 2018.
The Nidahas Trophy tri-nation Twenty20 tournament involving Sri Lanka, Bangladesh and India. / AFP PHOTO / LAKRUWAN WANNIARACHCHI (Photo credit should read LAKRUWAN WANNIARACHCHI/AFP/Getty Images)

భారత్ క్రికెట్ లో సెలెక్టర్లు నమ్ముతున్నా మరో యువ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్. తన పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న సుందర్, శ్రీలంక పై కేవలం 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసాడు. అయితే బాంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచ్ లో వికెట్లు తీయని సుందర్, పవర్ ప్లే ఓవర్లలో చక్కటి బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు.

విజయ్ శంకర్

Indian cricketer Vijay Shankar (R) celebrates after he dismissed Bangladesh cricketer Mushfiqur Rahim during the second Twenty20 (T20) international cricket match between Bangladesh and India of the tri-nation Nidahas Trophy at the R. Premadasa stadium in Colombo on March 8, 2018.
The Nidahas Trophy tri-nation Twenty20 tournament involving Sri Lanka, Bangladesh and India. / AFP PHOTO (Photo credit should read /AFP/Getty Images)

బాట్ తో అవకాశం రాని విజయ్ శంకర్, ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్లలో బంతితో చక్కగా ఆకట్టుకున్నాడు. మరో సారి తన మీడియం పేస్ తో భారత్ బౌలింగ్ లో హార్దిక్ పాండ్య స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తాడు.

జయదేవ్ ఉనాద్కట్

India’s Jaydev Unadkat celebrates the dismissal of Sri Lanka’s Niroshan Dickwella during their second Twenty20 international cricket match in Indore, India, Friday, Dec. 22, 2017. (AP Photo/Rajanish Kakade)

డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా మంచి పేరు సాధిస్తున్న జయదేవ్ ఉనాద్కట్, జస్ప్రీత్ బుమ్రా లేని జట్టులో చివరి ఓవర్లలో చాలా ముఖ్య పాత్ర పోషించనున్నారు.

యుజ్వేంద్ర చాహల్

భారత్ కు ప్రధాన స్పిన్నర్ గా ఎదిగిన యుజ్వేంద్ర చాహల్, బాంగ్లాదేశ్ పై తన సత్తాను చాటాడు. కేవలం 19 పరుగులే ఇచ్చిన చాహల్ ఒక వికెట్ తీస్కొని భారత్ విజయంలో తన పాత్ర పోషించాడు.

శార్దూల ఠాకూర్

శ్రీలంక పై 27 పరుగులు ఒకే ఓవర్ లో ఇచ్చి విమర్శలకు గురైన పేస్ బౌలర్ శార్దూల ఠాకూర్, బాంగ్లాదేశ్ పై చక్కగా రాణించాడు. తన నాలుగు ఓవర్లలో కేవలం 25 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.

SHARE