Image Credits: Deccan Chronicle

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ ఏడాది తో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఐతే 2008 లో మొదటి సరి ఐపిఎల్ ఆడినప్పుడు అన్ని కాంట్రాక్టులు 10 ఏళ్ళ పరిధి లో ఒప్పుకున్నారు.

ఇప్పుడు 11 వ ఎడిషన్ ముందు బిసిసిఐ మరియు ఫ్రాంఛైసులు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే విషయం పై కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి. వచ్చే ఏడాది జరగబోయే ఐపిఎల్ ఆక్షన్, ఇప్పటి వరకు జరిగిన అన్నిటి కంటే పెద్దది ఐన ఫ్రాంఛైసులు ఎంత మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు అనే విషయం పై తర్జన భర్జన పడుతున్నాయి.

ఇప్పటి వరకు బిసిసిఐ ఎటువంటి నిర్ణయం రిటెన్షన్ తీసుకోనప్పటికీ మంగళవారం జరిగే ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ లో తుది నిర్ణయం తీసుకోవచ్చు అని మీడియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మీటింగ్ లో తీసుకునే నిర్ణయాన్ని నవంబర్ 14 న ఫ్రాంచైస్స్ తో జరిగే సమావేశం లో బహిర్గతం చేయొచ్చు అని పలు మీడియా వర్గాలు ఆశభావం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రస్తుత రిపోర్టుల ప్రకారం, బిసిసిఐ ఫ్రాంచైస్స్ ను ఒక భారత ఆటగాడు మరియు 2 విదేశీ ఆటగాళ్లను లేదా ఒక విదేశీ ఆటగాడు మరియు రెండు భారత్ ఆటగాళ్లను రిటైన్ చేసుకోమనవచ్చు.

అయితే అన్ని జట్లు రిటెన్షన్ పై మక్కువ చూపించడం లేదు కానీ మళ్ళీ పునర్ ప్రవేశం చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మాత్రం తమ పాత ఆటగాళ్లను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి.

కానీ ఇండియన్ ఎక్ప్రేస్ ప్రకారం డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ వచ్చే ఏడాది కి ఐదుగురు ఆటగాళ్లని రిటైన్ చేసుకోవడానికి సుముఖాతం వ్యకతం చేయగా, రెండు సార్లు ఐపిఎల్ గెలిచినా కోల్ కతా కింగ్స్ రైడర్స్ ఒకే ఆటగాడిని రిటైన్ చేసుకోవడానికి చూస్తున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోని ను ఎటువంటి పరిస్థితిలోను వదిలేందుకు ఇష్టపడకపోగా రాజస్థాన్ రాయల్స్ 2015 లో ఉన్న తమ పూర్తి స్క్వాడ్ ను ఆక్షన్ కు తిరిగి పంపే ఆలోచన లో ఉన్నారు అని తెలుస్తుంది. అయితే బిసిసిఐ మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. 10 సంవత్సరాల తర్వాత ఎక్కువ శాతం ఫ్రాంఛైసులు తమ టీమ్స్ ను ప్రునర్నిర్మాణం చేసుకుందుకు ఇష్టపడుతున్నాయి.

SHARE