Bengaluru : Cricketer Mahendra Singh Dhoni and Mohd Shammi at a net session ahead of the Vijay Hazare trophy match in Bengaluru on Tuesday. PTI Photo by Shailendra Bhojak(PTI12_8_2015_000225A)

తనపై వస్తున్న ఆరోపణల మధ్యలో భారత్ క్రికెటర్ మొహమ్మద్ షమీకు మద్దతుగా నిలిచాడు మాజి కెప్టెన్ ఎం ఎస్ ధోని. గత వారం రోజులగా పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ భారత్ మొత్తం న్యూస్ చానెల్స్ లో ముఖ్యమైన న్యూస్ గా తయ్యారయ్యాడు. అతని భార్య హసిన్ జహాన్ అతనికి వేరే స్త్రీలతో అక్రమసంబంధం ఉన్నట్టు ఆరోపించిన విషయం తెలిసినదే.

అయితే అతను జహాన్ పై భౌతిక దాడి కూడా చేసినట్టు ఆమె ఆరోపించడం సంచలనం. జహాన్ తన భర్త షమీ చేసిన వాట్స్ అప్ చాటింగ్, పేస్ బుక్ చాటింగ్ యొక్క స్క్రీన్ షాట్స్ తీసి మీడియా కు విడుదల చేసింది. అతనిపై లాల్ బాజార్ లో పోలీస్ స్టేషన్లో కూడా పలు సెక్షన్ల లో కేసు నమోదు చేసింది.

“షమీకు చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉంది. అందులో కొందరు భారత్ లో వేరే ప్రదేశాల వారు కాగా, మరి కొందరు పాకిస్తాన్, యూరోప్ దేశాల వారు. పర్యటనలకు వెళ్ళినప్పుడు షమీ వారితో హోటల్ లలో సమయం గడిపేవాడు,” అని హసిన్ జహాన్ చెప్పారు.

షమీ పై నమోదు చేసిన ఆరోపణలలో ముఖ్యంగా సెక్షన్ 498A లో బుక్ చేసారు. ఐతే సెక్షన్ 307 – అట్టెంప్ట్ టు మర్డర్, సెక్షన్ 323 , 328 , 376 మరియు 506 లో కేసు నమోదు చేసారు.

అయితే ఈ విషయం పై ప్రస్తుత క్రికెటర్లు అంత మౌనంగా ఉండగా, భారత్ మాజీ కెప్టెన్ ఎం ఎస్ ధోని మాత్రం తన జట్టు సభ్యుడు షమీకు మద్దతు తెలిపాడు.

షమీ పై వస్తున్న ఆరోపణల గురించి ధోనిని పంజాబ్ కెశ్రీ అడగగా, “నాకు తెలిసినంత వరకు షమీ చాలా మంచి వ్యక్తి. తన భార్యను, దేశాన్ని మోసం చేస్తాడు అని నేను అనుకోను. అయితే ఇదే అతని వ్యక్తిగత సమస్య, నేను దీనిపై కామెంట్ చేయను,” అని అన్నారు.

ఇప్పటి వరకు కేవలం భారత్ దిగ్గజం కపిల్ దేవ్, చేతన్ చౌహన్ మాత్రమే షమీకు మద్దతు తెలుపగా, భారత్ జట్టులో కొందరు మాత్రం ఈ విషయం పై కామెంట్ చేయండని ఇష్టపడలేదు.

SHARE