Image Credits: AFP

న్యూజిలాండ్ పై తొలి టీ 20 లో ఘన విజయం సాధించి భారత క్రికెట్ జట్టు ఆశిష్ నెహ్రా కు చక్కని విధంగా వీడ్కోలు చెప్పింది. 1999 లో తొలి సారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన నెహ్రా, 18 సంవత్సరాలో చాలా సార్లు గాయాల పాలు అయ్యాడు.

తన కెరీర్ మొత్తం 12 సార్లు సర్జరీలు చేయించుకున్న నెహ్రా, ప్రతి సారి రేటించిన ఉత్సాహం, పట్టుదల తో భారత్ జట్టు కి ఎంపిక అయ్యాడు. అలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొని భారత క్రికెట్ చరిత్రలో దిగ్గజం గా నిలిచాడు.

మొదటి టీ20లో అన్ని రంగాల్లోనూ చక్కగా రాణించిన టీం ఇండియా, 53 పరుగులతో న్యూజిలాండ్ ను ఓడించింది. మ్యాచ్ తర్వాత మాట్లాడు నెహ్రా ఉద్వేగానికి గురికాగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ వెటరన్ బౌలర్ ను కొనియాడారు.

New Delhi: India’s Ashish Nehra waves to crowd after his retirement from all forms of cricket during the first T20 match against New Zealand at Feroz Shah Kotla Stadium in New Delhi, on Wednesday. PTI Photo by Manvender Vashist (PTI11_1_2017_000225B)

మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ ను తాను 13 సంవత్సరాల వయస్సు లో ఆశిష్ నెహ్రా దగ్గర నుండి అవార్డు తీసుకున్న సంఘటన గురించి అడగగా, కెప్టెన్ కోహ్లీ నెహ్రా పై ప్రశంసల వర్షం కురిపించాడు.

” ఆ సమయం లో నేను ఢిల్లీ రంజీ జట్టు లో చోటు కోసం కష్టపడుతున్న రోజులు. కానీ ఇప్పుడు నెహ్రా రిటైర్ అయ్యేటప్పడికి నేను కెప్టెన్ అయ్యాను.

” అన్ని సర్జరీలు ఆయినా తరవాత మళ్ళీ మళ్ళీ టీం లో కి రావడం చాలా కష్టం. ఆయన ఇలాంటి వీడ్కోలు కు అర్హుడు. అతనికి చాలా చక్కటి కుటుంబం ఉంది, ” అని చెప్పాడు.

తన సొంత మైదానం అయినా ఫిరోజ్ షా కోట్ల లో ఆఖరి మ్యాచ్ ఆడిన నెహ్రా ను కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు ధావన్ మ్యాచ్ తర్వాత గ్రౌండ్ చుట్టూ తమ భుజాల పై తీసుకువెళ్లారు.

India’s Ashish Nehra, celebrates the wicket of England’s Sam Billings during their second Twenty20 international cricket match at Vidarbha cricket association stadium in Nagpur, India, Sunday, Jan 29, 2017. (AP Photo/Rajanish Kakade)

1999 లో అజారుద్దీన్ నాయకత్వంలో కెరీర్ ప్రారంభించిన నెహ్రా, అనేక ఒడిదూడుకులు ఎదుర్కొంటు 18 సంవత్సరాల పాటు భారత క్రికెట్ జట్టు కు ఎనలేని సేవలు అందించారు. గాయాల కారణంగా ఎన్నో కష్టాలు చుసిన నెహ్రా అంటే అందరికి అభిమానమే.

SHARE