LONDON, ENGLAND - JULY 21: Former Indian batsman Sourav Ganguly rings the five minute bell ahead of day five of 2nd Investec Test match between England and India at Lord's Cricket Ground on July 21, 2014 in London, United Kingdom. (Photo by Gareth Copley/Getty Images)

ఇతి వాలే భారత క్రికెట్ జట్టు లో హార్దిక్ పాండ్య మంచి పేరు సాధించాడు. తన విద్వంసకర బాటింగ్, అద్భుతమైన ఫీడ్లింగ్ మరియు చక్కటి బౌలింగ్ తో ఒంటి చేత్తో టీం ను ముందుకు తీసుకువెళ్తున్నాడు.

కేవలం 23 సంవత్సరాలకే ప్రపంచం లోనే ఉత్తమ అల్-రౌండర్ గా మారిన హార్దిక్ పాండ్యను అప్పుడే చాలా మంది దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ తో పోల్చేస్తున్నారు. ఐతే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రం అల్-రౌండర్ ని అప్పుడే పోల్చడం సరి కాదు అని అన్నారు. కానీ పాండ్యకు భారత్ జట్టు ని మెరుగు పరిచే అన్ని రకాల లక్షణాలు ఉన్నాయి అని కొనియాడారు.

“హార్దిక్ పాండ్యకు ప్రస్తుత భారత క్రికెట్ జట్టు కు సహాయపడేందుకు అని విధాలైన లక్షణాలు ఉన్నాయి కానీ అప్పుడే కపిల్ దేవ్ తో పోల్చడం సరి కాదు. కపిల్ దేవ్ ఒక సంపూర్ణ ఛాంపియన్. హార్దిక్ పాండ్య మరో 10 -15 సంవత్సరాలు ఇండియా కు ఆడిన తర్వాత ఈ విషయం గురించి మాట్లాడుకుందాం,” అని అన్నారు.

“హార్దిక్ చాలా మంచి క్రికెటర్. అతను ఒక యోధుడు, క్రికెట్ ఆడటానికి పరితపించే మనస్తత్వం కలిగిన మంచి యువ క్రికెటర్. అతను ఇలానే తన మంచి ఫార్మ్ కనబర్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న,” అని సౌరవ్ గంగూలీ చెప్పారు.